రాజన్న సిరిసిల్లా లో విషాదం

పాము కాటుకు ఏడాదిన్నర చిన్నారి మృతి

Update: 2025-10-27 11:38 GMT

పాము కాటుకు చిన్నారి బలి అయ్యింది. రాజన్నసిరిసిల్లా జిల్లా చందుర్తి మండలం అశిరెడ్డిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చేకుట రమేష్ , లత దంపతులకు ఏడాదిన్నర వేదాన్షి అనే కూతురు ఉంది. గత రాత్రి ఇంట్లో ఆడుకుంటుండగా పెద్దగా చప్పుడు వినిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా చిన్నారి కాలి వేళ్ల మధ్యలో నుంచి రక్త స్రావమయ్యింది. వెంటనే కుటుంబ సభ్యులు వేముల వాడలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పాముకాటువల్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అక్కడి నుంచి అర్దరాత్రి ఎల్లారెడ్డిపేటకు తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది. చిన్నారి తండ్రి రమేష్ ఆరు నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. కూతురు మరణించినట్లు తెలుసుకున్న రమేష్ హుటా హుటిన స్వగ్రామానికి బయలు దేరాడు. చిన్నారి మృత దేహాన్ని ఫ్రీజర్ లో భధ్రపరిచారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సాధారణంగా పాములు ఏ తుప్పల్లోనో.. పొలాలలో కనిపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో పాములు పుట్టల్లో నుంచి జనావాసాల్లోకి వస్తుంటాయి. ఈ మధ్యకాలంలో ఇళ్లలో, బాత్‌ రూం, షూలలో కూడా కనిపిస్తున్నాయి. తాజాగా ఓ బైకులో దూరిన పాము కలకలం రేపింది. మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లగా దాన్ని బయటకు తీశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఓ రైతుకు చెందిన ద్విచక్ర వాహనం లోకి పాము ప్రవేశించింది. ఎంతసేపటికి పాము బయటకు రాకపోవడంతో ధైర్యం చేసి దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్ వద్దకు తీసుకెళ్ళాడు. బైక్ మెకానిక్ ఎంత చూసినా దొరకకపోవడంతో.. చివరికి బైక్ ఇంజన్ మొత్తం విప్పేసారు. అయినా పాము మాత్రం దొరకలేదు. పాము మాత్రం తెలివిగా ఇంజన్ లోపల వెళ్లి దాక్కుంది

బైకులో పాము దొరకడంతో అక్కడున్న జనాలు తమ సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

Tags:    

Similar News