హైదరాబాద్ పబ్బుల్లో శిక్షణ పొందిన డాగ్స్

హైదరాబాద్ పబ్బుల్లో ఫుల్లీ ట్రైన్డ్ డాగ్స్ ఎంటర్ అయ్యాయి. ఆదివారం పబ్బులు చుట్టేస్తూ హడావిడి చేశాయి.

Update: 2024-06-30 15:11 GMT

హైదరాబాద్ పబ్బుల్లో ఫుల్లీ ట్రైన్డ్ డాగ్స్ ఎంటర్ అయ్యాయి. ఆదివారం పబ్బులు చుట్టేస్తూ హడావిడి చేశాయి. అయితే ఈ డాగ్స్ పబ్స్ కి వెళ్ళింది ఎంజాయ్ చేయడానికో, కస్టమర్స్ ని ఎంటర్టైన్ చేయడానికో కాదు. అలాగే ఇవి సాధారణ డాగ్స్ కూడా కాదు. పోలీసు శాఖలో క్రిమినల్స్ ని పట్టుకోడానికి స్పెషల్ గా శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి డ్రగ్స్ నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. మాదకద్రవ్యాలు సేకరించడం వల్లే యువతలో ఉన్మాదం పెరిగిపోతోందని, డ్రగ్స్ తీసుకుంటున్నవారు క్రిమినల్ యాక్టివిటీస్ కి కూడా పాల్పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. రాష్ట్రంలో క్రైం రేట్ తగ్గించడానికి డ్రగ్స్ నియంత్రణ కూడా అవసరమని భావిస్తోన్న సర్కార్... ఆ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డ్రగ్స్ పెడ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

ఈ క్రమంలో పబ్బులు, క్లబ్బులపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్నిపర్ డాగ్స్ ని సోదాలకి తీసుకెళ్తున్నారు. వీకెండ్ కావడంతో ఆదివారం హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జూబిలీహిల్స్, బంజారాహిల్స్ లోని పబ్బుల్లో డాగ్స్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు.

Tags:    

Similar News