తెలంగాణ ఉద్యమాల అజ్ఞాత శక్తులకు వందనాలు...

ప్రజా సంఘాలలో నాయకులుగా పనిచేసిన వారి భార్యలు ఉద్యమానికి చేసిన సేవలు మరువ లేనివి.అందులో వీరగోని లక్ష్మి ఒకరు

Update: 2024-12-03 02:52 GMT
వీరగోని లక్ష్మి, తెలంగాణ ఉద్యమాల అజ్ఞాత శక్తి

-జూకంటి జగన్నాథం


1980 ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో ఉద్యమాలు లేచాయి.అనేక విభాగాలలో ప్రజాసంఘాల నిర్మాణం జరిగింది. ఊహించని ప్రాంతాల నుంచి నాయకులుగా ఎదిగొచ్చిన వాళ్ళు ఉన్నారు అందులో ఒకరు వీరవోని పెంటయ్య గౌడ్ సార్ మంథని ప్రాంతం కు చెందిన ఈయన స్వగ్రామం ధన్వాడ .1973 లో ఉపాధ్యాయులుగా ఉద్యోగంలో చేరాడు. 1974లో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ దగ్గర పంకెన గ్రామానికి చెందిన లక్ష్మీ తో వివాహం జరిగింది. దాదాపు ఐదు దశాబ్దాల వివాహ జీవితంలో నుంచి పెంటయ్య సార్ను ఒంటరిని చేసి అకస్మాత్తుగా గత శనివారం 23 రాత్రి ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించినది. ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు మనుమలు మరమరాళ్లతో కుటుంబం కొనసాగుతున్నది.

వీరి వివాహమైన కొత్తలో మంథని ప్రాంతం కేంద్రంగా వాముపక్ష నక్సలైట్ ఉద్యమాలు ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి.రైతు కూలీలు బీడీ తునికాకు కూలీలు సారా వ్యతిరేక ఉద్యమాలు సంఘాలు ఏర్పడి తమ తమ డిమాండ్ల సాధన కోసం కలిసికట్టుగా నాటి జ్ఞాత అజ్ఞాత నాయకుల వెన్ను దన్నుగా పని చేస్తున్న కాలం. ఊరేగింపులు నిరసనలు కరపత్రాలు వాల్ పోస్టర్లు పాటలు సున్నం వేసిన ఇంటి గోడల మీద వర్ధిల్లాలనే మిల మిళా మెరిసే జాజు అక్షరాలు. పేదలకు నోళ్లు ఇచ్చారు ప్రశ్న కొడవలియై ప్రతి పనిమిట్టు ఆయుధమై కదలాడింది. ఎంతసేపు ఊళ్ళలోకి స్కూల్లను పాఠశాలలు గాని ప్రభుత్వ పాఠశాలను రానీయని భూస్వాముల దిక్కరించి స్కూళ్లు ఉపాధ్యాయులు విద్యార్థులు అక్షరాల బహుజన కెరటాలై లేచారు . కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు అడగడం షురూ చేశారు. ప్రశ్నించడాన్ని ప్రభుత్వం తిరుగుబాటు అన్నది. 


అదిగో అటువంటి వాతావరణంలో వాడలోని ధన్వాడలోని ఒక యువకుడు ఉపాధ్యాయుడై దగ్గరికి ఊర్లో పనిచేస్తున్నా డు. చుట్టూ గ్రామాలలో వెలుగులు అలుగులై మత్తడి దుముకుతుంటే ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న యువకుడైన పెంటయ్య సార్ను వొరుసకు పారకుండా ఎలా ఉంటుంది. అప్పుడే పెట్టేశారు జీవితంలోకి అడుగుడిన నిరక్షరాస్యులైన లక్ష్మిని తన పరిధి మేరకు ఆలోచింప చేయకుండా ఎలా ఉంటుంది.


బలమైన ఉపాధ్యాయ సంఘాల నిర్మాణం జరుగుతున్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలమైన ఉపాధ్యాయ సంఘం ఏపీటీఎఫ్ ఉండే రెండు గ్రూపులుగా చీలిపోయింది. ఒకటి ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం గా మరొకటి డిటిఎఫ్ డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ గా కొనసాగాయి . అప్పుడప్పుడే మంథని ప్రాంతం నుంచి ఆలోచనపరులుగా ఉపాధ్యాయ నాయకుడిగా వీరగోని పెంటయ్య ఎదుగుతున్న కాలం. అప్పుడు ఆ ప్రాంతం నుంచి నాటి డిటిఎఫ్ నాయకుడు భూమయ్య సార్ ఆకుల భూమయ్య సార్ నాయకత్వంలో బహుముఖంగా ఎదిగిన వీరగోని పెంటయ్య డిటిఎఫ్ నాయకుడిగా జిల్లా స్థాయిలో డైనమిక్ గా పని చేశాడు.

వాళ్ల ఊర్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడే అజ్ఞాతంలో పనిచేస్తున్న సభ్యులు ఇంటికి వచ్చి పోతుండే వారు., వాళ్లు రావడంతో అక్కా ,అమ్మా అన్నా అంటూ మనసులను చూరవనేవారు . వంటింట్లోకి వెళ్లి వంట మేము చేస్తామని కలివిడిగా ఉండేవారు. ఎక్కడో పుట్టి పేద ప్రజల కోసం తమ ప్రాణాలకు పణంగా పెట్టి పని చేస్తున్న వారి పట్ల ప్రజలలో గ్రామాలలో చెప్పుకోదగ్గ ఆదరణ లభించేది. అయితే లక్ష్మీ గారు కూడా మొదట్లో బెరుకుగా ఇరుకిరుకుగా ఉన్నా క్రమంగా వారిని అర్థం చేసుకొని కలివిడిగా ఉండేది. ఇంటికి వస్తే తిండి పెట్టడమే కాకుండా ఒక 25 కిలో కిలోల అటుకుల చుడువా బస్తా నింపి ఇచ్చేది. ఉపాధ్యాయులను నాటి జిల్లా స్థాయిలో చురుగ్గా పనిచేసే ప్రజా సంఘాల నాయకులను ఎన్ని ఇబ్బందులు ఉన్నా సమాదరించేది.

బతికి ఉండగానే లక్ష్మీ పెంటయ్య సార్లు ఇరువురు తమ మరణానంతర దేహాలను వైద్య కళాశాలకు ఇవ్వడం చాలామందిని ఆశ్చర్యానికి లోను చేసింది. తల్లిదండ్రుల ఆశయాలను వారి నమ్మకాలను అభిప్రాయాలను గౌరవించి ఆచరించే పిల్లలు ఉండడం నిజంగా ముఖ్యంగా తల్లిదండ్రులలో తల్లి లక్ష్మీ గారి పెంపకం యొక్క తర్ఫీదు ఇమిడి ఉందని అనిపిస్తుంది . లక్ష్మీ గారు తల తోచిన విధంగా ఆ ఇంటిని చైతన్యవంతంగా తీర్చిదిద్దారు వారికి నా హృదయపూర్వక నివాళులు .

(జూకంటి జగన్నాథం కవి. రచయిత)


Tags:    

Similar News