గ్రీన్ ఫీల్డ్ హైవే ఒక గేమ్ ఛేంజర్..

ఈ హైవే ఎందుకంత స్పెషల్.;

Update: 2025-09-06 11:18 GMT

సూర్యపేట నుంచి దేవరపల్లి వరకు కేంద్రం నిర్మిస్తున్న నేషనల్ హైవే పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం పరిశీలించారు. ఈ హైవే ఒక గేమ్ ఛేంజర్‌గా నిలువనుందని ఆయన అన్నారు. దంసలాపురం వద్ద జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. రహదారి ఎంట్రీ, ఎగ్జిట్, మున్నేరు బ్రిడ్స్ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగానే ఈ హైవే తెలంగాణ రవాణా రంగానికి భారీ బూస్ట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆలస్యమవుతున్న పనులు

‘‘ఉత్తర, దక్షిణ భారతాన్ని కలుపుతూ కనెక్టింగ్ హైవేగా ఖమ్మానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే గేమ్‌ ఛేంజర్‌గా మారుతుంది. ఈ రహదారి పూర్తయితే ఖమ్మం నుంచి రాజమండ్రికి గంటన్నర సమయంలో ప్రయాణం చేయవచ్చు. సూర్యాపేట నుంచి విజయవాడ వెళ్లకుండా ఖమ్మం మీదుగా విశాఖపట్నం, ఒడిశా వెళ్లేవారికి దాదాపు 150 కి.మీ ప్రయాణం తగ్గుతుంది. ఖమ్మం నగరంలోని దంసలాపురం ఎగ్జిట్‌ ప్రణాళికలో లేనందున పనులు ఆలస్యమవుతున్నాయి. ఈ పనులతోపాటు మున్నేరు బ్రిడ్జి రైల్వే ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు నవంబరు నాటికి పూర్తవుతాయి. ఖమ్మం నుంచి కల్లూరు వరకు వ్యవసాయ పనులకు ఇబ్బందులు లేకుండా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి’’ అని హైవే అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ హైవే పనులు రూ.3500 కోట్ల వ్యయంతో కొనసాగుతున్నట్లు తెలిపారు.

అసలేంటీ గ్రీన్ ఫీల్డ్ హైవే..

హైదరాబాద్, విశాఖ రెండు నగరాలు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా ముఖ్యమైనవి. ఇవి వ్యాపార, పారిశ్రామిక కేంద్రాలుగా విస్తరిస్తున్నాయి. దీంతో ఈ రెండు నగరాల మధ్య రవాణా పెరుగుతోంది. కానీ ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించాలంటే పెద్ద టాస్క్‌ అవుతోంది. హైదరాబాద్, వైజాగ్ రెండిటి మధ్య దూరం 676 కిలోమీటర్లు, ఈ ప్రయాణానికి 12 గంటలు పడుతుంది. ఈ ప్రయాణ సమయాన్ని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం.. ఖమ్మం -దేవర పల్లి మధ్య ‘గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ హైవే 365-BG’ పేరుతో నే షనల్ హైవే నిర్మిస్తోంది. ఈ ప్రాజక్టును గ్రీన్ హైవేస్ పాలసీ కింద చేపట్టారు. ఇందులో భాగంగా దారి పొడుగునా అందమయిన చెట్లు నాటి ప్రయాణం ఆహ్లాదకరంగా సాగేందుకు చర్యలు తీసుకుంటారు.

Full View

దానికితోడు ఈ రహదారి పచ్చని పంటపొలాల మధ్య అటవీ ప్రాంతాల నుంచి సాగుతుంది. కాబట్టి ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ హైవే పూర్తయితే హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ వెళ్లిపోవచ్చు. ఈ రహదారి దూరం 162 కిలోమీటర్లు. ఇందుకోసం 31 గ్రామాల్లో 1996 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం సేకరించింది. ఈ ప్రాజక్టును భారత్ మాల పరియోజన పథకం కింద నిర్మిస్తున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే తూర్పుగోదావరి జిల్లా దేవర పల్లి వద్ద జాతీయ రహదారి నెంబర్ 16తో కలుస్తుంది.

Tags:    

Similar News