తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు.. పోలీసులను ఆశ్రయించిన బీఆర్ఎస్ నేతలు

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో తెలంగాణ తల్లికి ఘోర అవమానం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు తల్లి విగ్రహానికి నిప్పు పెట్టారు.

Update: 2024-10-01 07:16 GMT

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో తెలంగాణ తల్లికి ఘోర అవమానం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు తల్లి విగ్రహానికి నిప్పు పెట్టారు. కారణం ఏదైనా తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టడం యావత్ తెలంగాణను అవమానించడమేనని స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం కాస్తా ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ దుశ్చర్యకు పాల్పడింది కాంగ్రెస్ గూండాలేనని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టింది ఎవరైనా వదలకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏం జరిగిందంటే..

అక్కన్నపేట మండలం చౌటపల్లిలోని బురుజు చౌరస్తా దగ్గర తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఇంకా విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. ఇంతలోనే గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆదివారం అర్థరాత్రి.. విగ్రహంపై కప్పి ఉన్న వస్త్రానికి నిప్పు పెట్టారు. దీంతో విగ్రహం పాక్షికంగా దగ్దమైంది. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదలకూడదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాయ రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు అధికమవుతున్నాయని బీఆర్ఎస్ నేతుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం..

తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పంటించిన అంశం తెలిసిన వెంటనే స్థానిక బీఆర్ఎస్ నేతలు గద్దల రమేశ్, గంగాధరి రాజయ్య, వెల్ది రంగారావు, మాజీ ఎంపీపీ లక్ష్మీ బీలూనాయక్ సహా పలువురు నేతలు అక్కడకు చేరుకున్నారు. ఇటువంటి చర్యలను వారు తీవ్రంఘా ఖండించారు. విగ్రహం వద్దకు చేరుకున్న నాయకులు.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని నీటితో శుభ్రం చేశారు. అనంతరం క్షీరాభిషేకం చేశారు. తిరిగి విగ్రహానికి ముసుగు వేశారు. ఈ ఘటనపై పోలీసులతో పాటు ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని, ఎటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Tags:    

Similar News