డిసెంబర్ కల్లా ఉప్పుగూడ రైల్వే స్టేషన్

అత్యాధునిక సొగసులతో..;

Update: 2025-07-24 10:55 GMT

హైటెక్ హంగులతో ఉప్పుగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అనౌన్స్ చేసింది. ఈ సందర్బంగా అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్‌ పథకంలో భాగంగా రూ.26.81 కోట్లతో ఈ స్టేషన్‌లో చేపట్టిన ఆధునీకరణ పనులు డిసెంబరు ఆఖరుకల్లా పూర్తి చేయనున్నట్టు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. జంట నగరాల్లోని రైల్వే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే అడుగులు వేస్తోంది. మరింత సౌకర్యాలు అందించడానికి వీలుగా స్టేషన్లో నిర్మాణపనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టారు. హైదరాబాద్ దక్షిణ భాగంలో ఉన్న ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌ జంటనగరాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.

Tags:    

Similar News