ఫిబ్రవరి 14వతేదీన వాలంటైన్స్ డే వేడుకలు(Valentine’s Day) జరుపుకునేందుకు హైదరాబాద్ (Hyderabad)నగరంలో యువతీ,యువకులు సమాయత్తం అయ్యారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేయసీ, ప్రియులు రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే లంటూ జీవితాంతం గుర్తుండిపోయేలా వారంరోజుల పాటు వేడుకలు జరుపుకుంటున్నారు.
వాలంటైన్స్ డే స్పెషల్ ఆఫర్లు
వాలంటైన్స్ డే సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు హోటళ్లు, వినోద సంస్థలు ప్రేమికులకు స్పెషల్ ఆఫర్లు ప్రకటించాయి. ఫిబ్రవరి 16వతేదీ వరకు వాలంటైన్స్ వేడుకల్లో పాల్గొనే ప్రేమసీ, ప్రియులు, దంపతులకు వండర్ లా 35 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. వండర్లా హాలిడేలో స్కైవీల్ డైన్, వేవ్ పూల్ డిన్నర్ ప్రేమికులకు ప్రత్యేకంగా నిలవనుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇండిగో విమాన యాన సంస్థ ఎంపిక చేసిన మార్గాల్లో జంటలకు టికెట్ ధరలో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఓయోరూంలు, పార్కులకు డిమాండ్
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పార్కులు,హోటళ్లు, ఓయోరూంలకు డిమాండ్ ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో ఓయో రూమ్స్ బుకింగ్ భారీగా జరిగిందని ఓ హోటల్ నిర్వాహకుడు రవిరాజ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పార్కులు, హోటళ్లు శుక్రవారం ప్రేమికులతో కళకళలాడనున్నాయి.
వాలంటైన్స్ డే స్పెషల్ సినిమాలు
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా( Valentine’s Day celebrations)హైదరాబాద్ నగరంలో థియేటర్లు, ఓటీటీల్లోనూ ప్రత్యేక సినిమాలు విడుదలయ్యాయి. యువతరాన్ని ఆకట్టుకునే లవ్ రొమాంటిక్ సినిమాలు లైలా, ఇట్స్ కాంప్లికేటెడ్, ఆరెంజ్, బ్రహ్మా ఆనందం,తల,చావా సినిమాలు వాలంటైన్స్ డే సందర్భంగా వినోదాన్ని అందించనున్నాయి.
లిప్ కిస్ పోటీలు
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాగురి జిల్లాలోని మక్రేపారా మైదానంలో వాలంటైన్స్ డే సందర్భంగా శుక్రవారం లిప్ కిస్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ లిప్ కిస్ పోటీల్లో పాల్గొనేందుకు 15 నుంచి 90 ఏళ్ల వయసు వారు అర్హులని ప్రకటించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు మీ ప్రియురాలిని తీసుకొని రండి అంటూ సోషల్ మీడియాలో నితేష్ అనే నెటిజన్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఈ ఎక్స్ పోస్టు యువతకు క్రేజీగా మారింది.
'వాలంటైన్ డే' పేరుతో ఇవేం వెర్రి పనులు: వీసీ సజ్జనార్
ప్రేమికుల దినోత్సవం సందర్బంగా అదిరిపోయే స్టంట్లు అంటూ అదేదో ఘనత సాధించినట్లు కొన్ని జంటలు సోషల్ మీడియాలో స్టంట్ వీడియోలను సోషల్ మీడియాలో వదిలాయి.‘‘అతి వేగంతో ప్రమాదకరరీతిలో చేసే ఈ చిత్ర విచిత్ర విన్యాసాలు మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి’’ అంటూ వీసీ సజ్జనార్ ఎక్స్ లో పోస్టు చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేయడం డేంజర్ అని ఇలాంటి సాహసాలు చేసి ప్రమాదాలు కొనితెచ్చుకొని మీ కుటుంబసభ్యులను మనోవేదనకు గురిచేయకండి అని సజ్జనార్ హితవు పలికారు.