కెసీఆర్ కు ఈ సారి మళ్లీ ఏమయ్యింది ?
డిశ్చార్జ్ అయిన నాలుగు రోజులకే యశోదలో అడ్మిట్ అయ్యారు;
మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ మళ్లీ యశోద ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కెసీఆర్ మరో సారి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి.
ఈ నెల 3న కెసీఆర్ సోమాజీగుడా యశోద ఆస్పత్రిలో చేరారు. బీపీ, బ్లడ్ షుగర్ , సోడియం నిల్వలు ఎక్కువ ఉండటంతో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వీటిని మానిటర్ చేయడానికి వైద్యులు ఖచ్చితంగా రెండ్రోజులు ఉండాల్సి వస్తుందని కెసీఆర్ కు చెప్పడంతో ఆయన ఆస్పత్రిలో ఉండిపోయారు. ఈ నె ల 5న డిశ్చార్జ్ అయ్యారు. జనరల్ చెకప్ చేసుకుని వెళ్లిపోదామనుకున్న కెసీఆర్ కు వైద్యులు సూచించి ఆస్పత్రిలో ఉండేట్లు చేశారు. వారం రోజులు ఆస్ప్రతిలో విశ్రాంతి తీసుకుని మళ్లీ పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్యులు డిశ్చార్జ్ సమయంలో కూడా కెసీఆర్ కు చెప్పారు. అప్పుడు వైద్యులు చెప్పే మాటను కెసీఆర్ పట్టించుకోకపోవడంతో అసాధరణ తేడాలు వచ్చినట్లు తెలుస్తోంది. డిశ్చార్జ్ అయ్యాక కొడుకు నివాసమున్న నందినగర్ కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. అలా వెళ్లిన కేసీఆర్ నాలుగురోజుల తర్వాత గురువారం మళ్లీ అదే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.
ఇటీవలె కేసీఆర్ తరచూ హస్పిటల్ లో అడ్మిట్ అవుతున్నారు. తుంటి ఎముక విరిగినప్పుడు కేసీఆర్ ఇదే ఆస్పత్రిలో చేరి శస్త్ర చికిత్స తీసుకున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కు పెద్దగా ఆరోగ్య సమస్యలు రాలేదు. జనరల్ చెకప్ కోసం మాత్రమే కేసీఆర్ హాస్పిటల్ కు వెళ్లే వారు. కానీ అధికారం కోల్పోగానే ఆయనకు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. తుంటి ఎముక విరిగినప్పటి నుంచి బ్లడ్ షుగర్, సోడియం నిల్వలు అసాధరణంగా పెరిగిపోతున్నాయి. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వెలుపలికి వచ్చి కుటుంబ సభ్యులు చెప్పి ఉండవచ్చు. నిలకడగానే ఉంటే కేసీఆర్ మళ్లీ ఆస్పత్రికి ఎందుకు వచ్చినట్టు. ఇపుడు కెసీఆర్ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేసీఆర్ కు వచ్చిన ఆరోగ్య సమస్య చిన్నది కాదని తెలుస్తోంది. కేసీఆర్ శరీరంలో పెద్ద మార్పే జరిగిందని డాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేజర్ ప్రాబ్లం కాబట్టి ఆస్పత్రిలో చేరి ఉండవచ్చు అని వ్యాఖ్యానించారు.
వారికి అవకాశం ఇవ్వొద్దనే...
ఎక్కువ రోజులు ఆస్పత్రి లో ఉంటే తన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు తలెత్తుతాయని కేసీఆర్ భావించి ఉండవచ్చు. పైగా అధికార కాంగ్రేస్ పార్టీ దీన్ని అవకాశంగా తీసుకోవచ్చు.
ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు. తెలంగాణ ప్రజల సమస్యలపై కేసీఆర్ ముందుకు రావడం లేదు. బనకచర్ల వివాదంతో బాటు తెలంగాణ నీటిపారుదలా ప్రాజెక్టుకు సంబంధించి చర్చిండానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అవసరమైతే తన మంత్రులను కేసీఆర్ ఉంటున్న ఫామ్ హౌజ్ వద్దకు పంపిస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు ఆరోగ్య సమస్యలు ఉంటే తానే స్వయంగా ఎర్రవెల్లి ఫాం హౌజ్ వద్దకు వచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టులతో బాటు తెలంగాణ ప్రజల సమస్యలపై చర్చించడానికి సిద్దంగా ఉన్నానని రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లో కేసీఆర్ యశోదాలో అడ్మిట్ కావడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ ఆరోగ్యం గూర్చి రేవంత్ రెడ్డికి ముందే తెలిసిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.