కేఏ పాల్ కు ఏమవుతుందో ఏమో ?

లగచర్ల గ్రామసభలో కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద దాడి తర్వాత బీఆర్ఎస్ నేతలెవరూ అటువైపు తొంగికూడా చూడలేదు.

Update: 2024-11-20 11:30 GMT
KA Paul

లగచర్ల గ్రామసభలో కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద దాడి తర్వాత బీఆర్ఎస్ నేతలెవరూ అటువైపు తొంగికూడా చూడలేదు. దాడికి తమ పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narendar Reddy), బోగమోని సురేష్ కారణమని పోలీసులు అరెస్టులు చేయటంతో మళ్ళీ అటువైపు ఎవరూ తొంగికూడ చూడలేదు. బాధితులను కొడంగల్(Kodangal) నుండి హైదరాబాదు(Hyderabad0కు పిలిపించుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working president KTR) బాధితులతో పార్టీ ఆఫీసులోనే మాట్లాడారు. అవసరమైన న్యాయసహాయం, ఢిల్లీ పర్యటనల ఏర్పాట్లన్నీ చేశారు. అంతేకాని లగచర్లతో పాటు మరో రెండు గ్రామాల్లోని బాధితులను మత్రం నేరుగా వెళ్ళి ఓదార్చలేదు. ఇక బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(BJP MP DK Aruna) స్ధానికురాలే అయినా పోలీసులు అనుమతించలేదు. బాధితులను కలిసి మాట్లాడటానికి అరుణ ప్రయత్నాలు చేసినా ఉపయోగంలేకపోయింది. కొడంగల్ నియోజకవర్గంలోకి అరుణను పోలీసులు అనుమతించలేదు. లగచర్ల గ్రామంలోకి వెళ్ళేందుకు సీపీఎం ఏదో ప్లాన్ చేస్తోంది. సీపీఐ అయితే అసలు నోరుకూడా మెదపలేదు. ఎందుకంటే కాంగ్రెస్ కు మిత్రపక్షం కాబట్టి.

ఇక ప్రజాసంఘాలు బాధితులను కలిసేందుకు ప్రయత్నాలు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. ఈ నేపధ్యంలోనే తాను ఉన్నాను అంటు భరోసా ఇస్తున్నాడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్PrajaSanthi Party president KA Paul). ఎక్కడున్నాడో తెలీదు కాని ఫుల్లుగా సూట్ వేసుకుని లగచర్ల బాధితులను ఉద్దేశించి పాల్ 1.52 నిముషాల వీడియోను ట్విట్టర్లో(Twitter) రిలీజ్ చేశాడు. అందులో రెండు, మూడురోజుల్లో తాను వస్తున్నట్లు చెప్పాడు. బాధితులు ఎవరూ అధైర్య పడద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని భరోసా ఇచ్చేశాడు. తాను కొడంగల్ రాగానే వీళ్ళ అవినీతి మొత్తాన్ని బయటపెడదామని చెప్పాడు. బాధితులకు న్యాయం చేయటానికి తాను ఉన్నానని హామీ ఇచ్చాడు. అందరం కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేద్దామని చెప్పాడు. లక్షల కోట్లు వీళ్ళకు..లక్షల కోట్ల అప్పులు మనకా అంటు గట్టిగా ప్రశ్నించాడు.

తొందరలోనే అంటే జనవరిలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడిద్దామని పిలుపిచ్చాడు. ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీచేద్దామని అనుకుంటున్న వాళ్ళు, ఈ పార్టీలంటే పడనివాళ్ళంతా హైదరాబాద్, అమీర్ పేటలో ఉన్న ప్రజాశాంతిపార్టీ ఆపీసుకు ఈనెల 28వ తేదీన రావాలన్నాడు. అందరం కూర్చుని మాట్లాడుకుందామని చెప్పాడు. ఫార్మా కంపెనీలు పెట్టడానికి వీళ్ళకి వందలు, వేల కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయని అనుమానం వ్యక్తంచేశాడు. రేవంత్ రెడ్డి అల్లుడు డైరెక్టర్ గా ఉన్న మాక్స్ బీన్ కంపెనీ పైన కూడా పాల్ ఆరోపణలు చేశాడు. మొత్తానికి చాలా కాలానికి కేఏ పాల్ వీడియోలో జనాలను పలకరించాడు. మరి చెప్పినట్లే రెండు మూడు రోజుల్లో పాల్ కొడంగల్ వస్తాడా ? వస్తే ఏమవుతుందో ఏమో అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Tags:    

Similar News