Seethakka Logic|కేటీఆర్, హరీష్ పై మంత్రి సీతక్క సూపర్ లాజిక్

చేతులకు బేడీలు వేసుకోవటంలో కూడా కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish rao) తమ దొరతనం చూపించారని మండిపడ్డారు.

Update: 2024-12-17 10:11 GMT
Minister Seethakka in Assembly

అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్, హరీష్ రావుకు సంబందించి మంత్రి సీతక్క సూపర్ లాజిక్ వినిపించారు. ఇంతకీ విషయం ఏమిటంటే మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు విచిత్రమైన వైఖరితో వచ్చారు. ఎలాగంటే తమచేతులకు బేడీలు వేసుకుని, నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. శాసనసభ లాబీల్లో తమచేతులకు వేసుకున్న బేడీలను మీడియాకు చూపిస్తు తమ నిరసనను బాగా హైలైట్ అయ్యేట్లు చూసుకున్నారు. మీడియాలో బేడీలు వేసుకున్న గంగుల కమాలాకర్, సుధీర్ రెడ్డి తో పాటు మరో ఇద్దరు ఎంఎల్ఏలు కనిపించారు. వెనుక వరసలో మాధవరం కృష్ణారావు, హరీష్ రవు కనిపిస్తున్నారు. ఇక్కడే మంత్రి సూపర్ లాజిక్ వినిపించారు.

అదేమిటంటే చేతులకు బేడీలు వేసుకోవటంలో కూడా కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish rao) తమ దొరతనం చూపించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏలు చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీకి హాజరవ్వటంపై మంత్రి సీతక్క(Minister Seethakka) మాట్లాడుతు నిరసన తెలపటంలో కూడా కేటీఆర్, హరీష్ దొరల దురహంకారాన్ని ప్రదర్శించారని చెప్పారు. మిగిలిన ఎంఎల్ఏలకు బేడీలు వేసారు కాని తమచేతులకు మాత్రం బేడీలు వేసుకోలేదని ఎద్దేవాచేశారు. నిరసన తెలపటంలో కూడా కారుపార్టీలో సమానత్వం లేదన్న విషయాన్ని గ్రహించాలని మంత్రి అప్పీల్ చేశారు. లగచర్ల రైతు(Lagacharla Farmer) హీరానాయక్ కు బేడీలు వేసి ఆసుపత్రికి పోలీసులు తరలించటాన్ని నిరసిస్తు కేటీఆర్, హరీష్ రావులు కొద్దిరోజులుగా అదేపనిగా గోలచేస్తున్న విషయం తెలిసిందే.

ఇదే విషయాన్ని మంత్రి ప్రస్తావిస్తు ఖమ్మం, ఆదిలాబాద్, జగిత్యాల్ లో రైతులకు బీఆర్ఎస్ హయాంలో బేడీలు వేసి లాక్కెళ్ళిన విషయాలను కేటీఆర్, హరీష్ మరచిపోయినట్లున్నారని చురకలంటించారు. బీఆర్ఎస్ హయాంలో కనీసం పదిసందర్భాల్లో అయినా రైతులకు బేడీలు వేసుంటారని మంత్రి గుర్తుచేశారు. ఆ సమయంలో ఎంతగోల జరిగినా అధికారులపై అప్పటి ప్రభుత్వం కనీసం చర్యలు కూడా తీసుకోలేదన్నారు. కిందస్ధాయి పోలీసులు రైతు హీరానాయక్ కు బేడీలు వేయటాన్ని రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకుని సంబందిత అధికారిని సస్పెండ్ చేయటమే కాకుండా ఘటనపై విచారణ కూడా చేయిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. తమప్రభుత్వం తీసుకున్న చర్యలు, చేయిస్తున్న విచారణ విషయం తెలిసికూడా కేటీఆర్, హరీష్ తదితరులు కావాలనే సభలో గోలచేస్తున్నట్లు సీతక్క ఆరోపించారు.

దాదాపు నెలరోజులక్రితం లగచర్ల గ్రామంలో సభ నిర్వహించేందుకు వచ్చిన కలెక్టర్ ప్రతీక్ జైన్ పై గ్రామస్తులు, రైతులు దాడిచేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి పోలీసులు 41 మంది రైతులను అరెస్టుచేసి రిమాండులో ఉంచారు. వారిలో హీరానాయక్(Heeranaik) అనే రైతు అస్వస్ధతకు గురయ్యాడు. అందుకని ముందు సిద్ధిపేట ఆసుపత్రికి తర్వాత నిమ్స్(NIMS) కు తరలించారు పోలీసులు. ఆ సమయంలోనే రైతు చేతికి బేడీలు వేసి నడిపించారు. దానిపైనే ఇపుడు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు అసెంబ్లీలో గోలచేసింది. అయితే బీఆర్ఎస్ హయాంలో ఖమ్మం(Khammam) మిర్చి రైతులు 10 మందికి పోలీసులు ఇలాగే బేడీలు వేశారు. అలాగే ఆదిలాబాద్, జగిత్యాల్ లో కూడా రైతులకు పోలీసులు బేడీలు వేసే నడిపించారు. తమహయాంలో ఏమిజరిగిందనే విషయాలను కేటీఆర్, హరీష్ మరచిపోయినట్లు నటిస్తున్నారంటూ మంత్రి మండిపోయారు. తమహయాంలో ఏమైతే జరిగిందో ఇపుడూ అదే జరిగింది. తమ హయాంలో జరిగిన విషయాలపై అప్పట్లో నోరెత్తని కేటీఆర్, హరీష్ లు ఇపుడు మాత్రం గోలగోల చేస్తున్నారు.

Tags:    

Similar News