బ్రిటన్ తో కుదిరిన ఒప్పందం చారిత్రాత్మకమైంది: మోదీ

తమిళనాడు అభివృద్దికి కట్టుబడి ఉన్నామన్నా ప్రధాని;

Update: 2025-07-27 12:23 GMT
భారత ప్రధాని నరేంద్ర మోదీ

భారత్- యూకే మధ్య కుదిరిన ఎఫ్టీఏ చారిత్రకమైందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం ప్రపంచానికి దేశంపై ఏర్పడిన నమ్మకాన్ని చూపిస్తుందని అన్నారు. మాల్దీవులలో అధికారిక పర్యటనను ముగించుకున్న తరువాత ప్రధాని నేరుగా తమిళనాడులో అడుగుపెట్టారు.

ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ... ‘‘మేన్ ఇన్ ఇండియా’’ కింద తయారు చేయబడిన ఆయుధాలు సరిహద్దులో శత్రు దేశాల లక్ష్యాలను నాశనం చేయడంలో గొప్ప పాత్ర పోషించాయని, శత్రువులకు నిద్రలేని రాత్రులు మిగిల్చిందని అన్నారు.
అభివృద్ది ప్రొత్సాహం..
ప్రధాని మోదీ తమిళనాడులో దాదాపు 4,900 కోట్ల విలువైన ప్రాజెక్ట్ లను ప్రారంభించారు. కొన్ని ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేశారు. కొన్ని పనులను ప్రారంభించిన జాతికి అంకితం ఇచ్చారు. తమిళనాడు అభివృద్దికి ఎన్డీఏ నిబద్దతను నొక్కి చెప్పారు.
ప్రాజెక్ట్ లను ప్రారంభించిన తరువాత ప్రసంగించిన మోదీ, తన విదేశీ పర్యటనను ముగించుకుని తమిళనాడులో నేరుగా అడుగుపెట్టడం తన అదృష్టమని, ఆ పర్యటనలో భాగంగా మాల్దీవులకు వెళ్లే ముందు భారత్- యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పై సంతకం చేశానని అన్నారు.
వికసిత్ భారత్ తయారవుతుంది..
‘‘భారత్- ఇంగ్లాండ్ ఎఫ్టీఏపై సంతకం చేశాయి. ఇది ప్రపంచానికి మనకు పెరుగుతున్న విశ్వాసాన్ని, మన ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది. ఈ ఆత్మ విశ్వాసంతో మనం వికసిత్ భారత్, వికసిత్ తమిళనాడుగా మారుస్తాము’’ అని మోదీ అన్నారు.
‘‘బ్రిటన్ తో మా ఎఫ్టీఏ.. వికసిత్ భారత్, వికసిత్ తమిళనాడు దార్శనికతకు వేగాన్ని జోడిస్తుంది.’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఈ పర్యటనలో ఆయన సాంప్రదాయ ధోతీ, చొక్కా, మెడలో కండువా ధరించారు.
‘‘ఎప్టీఏ తరువాత బ్రిటన్ లో అమ్ముడవుతున్న 99 శాతం భారతీయ ఉత్పత్తులపై ఎటువంటి పన్ను ఉండదు. భారతీయ ఉత్పత్తులకు చౌకగా ఉంటే, అక్కడ డిమాండ్ పెరుగుతోంది. ఇది భారత్ లో మరిన్ని ఉత్పత్తి అవకాశాలకు దారి తీస్తుంది. ఈ ఎఫ్టీఏ కారణంగా తమిళనాడు యువత,చిన్న వ్యాపారాలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ లు, పెద్ద ప్రయోజనాలను పొందుతాయి’’ అని ఆయన అన్నారు.
తమిళనాడు అభివృద్దికి కట్టుబడి ఉన్నాం..
అభివృద్ది చెందిన భారత్, తమిళనాడును వాగ్ధానం చేశారు. ‘‘ఏ రాష్ట్ర అభివృద్దికి అయినా మౌలిక సదుపాయాలు, శక్తి, వెన్నెముక. గత 11 సంవత్సరాలుగా మౌలిక సదుపాయాలు, శక్తిపై మా దృష్టి తమిళనాడు వృద్దికి మా నిబద్దతను చాటి చెపుతుంది’’ అని ఆయన అన్నారు.
తమిళనాడు మోదీ రూ. 450 కోట్లతో అభివృద్ది చేసిన అత్యాధునిక ట్యూటీకోరిన్ విమానాశ్రయ టెర్మినల్ భవనం కూడా ఉంది. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి తంగం తేనరసు చెన్నైలోని ఐకానిక్ వల్లువర్ కొట్టం ప్రతిరూపాన్ని ప్రధానమంత్రికి అందజేశారు.
Tags:    

Similar News