కాలేజి యాజమాన్యాలకు రేవంత్ వార్నింగ్

డొనేషన్లు ఎలా తీసుకుంటారో చూస్తా

Update: 2025-11-07 14:08 GMT
Revanth reddy Angry

తమాషాలు చేస్తే తాట తీస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయివేట్ కళాశాలలకు వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రయివేటు కాలేజిలపై మండి పడ్డారు. విడతల వారిగా నిధులు విడుదల చేస్తాం. నిధుల కోసం కాలేజీలను మూసివేస్తామనే పేరుతో ప్రభుత్వాన్ని  బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. విద్యను వ్యాపారం చేస్తే సహించేది లేదని , ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో తనకు తెలుసన్నారు. వచ్చే సంవత్సరం డొనేషన్లు ఎలా తీసుకుంటారో చూస్తానని వార్నింగ్ ఇచ్చారు.  అధికంగా ఫీజులు  వసూలు చేయకుండా  ఉంటారా అని ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలపై సిఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


తర్వాత జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక గురించి మాట్లాడుతుూ, జూబ్లి హిల్స్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్దికి పట్టం కట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ఎన్నో ప్రాజెక్టులు వచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ లా మారిందని రేవంత్ అన్నారు. వాస్తు కోసం సచివాలయాన్ని కూల్చేసిన ఘనత కేసీఆర్ కు మాత్రమే దక్కిందన్నారు. మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే బిఆర్ఎస్ ప్రభుత్వ తెలంగాణను సర్వనాశనం చేసిందన్నారు.

Tags:    

Similar News