పొత్తు ఖరారు చేసిన అమిత్ షా

AIADMKతో కలిసి పోటీ చేస్తాయని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి..;

Update: 2025-04-11 12:32 GMT
Click the Play button to listen to article

తమిళనాట(Tamil Nadu) ఊహాగానాలు తెరపడింది. 2026 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ(BJP) ఒంటరిగా పోటీ చేస్తుందా? లేక ఇతర పార్టీలతో జతకడుతున్న అన్న ఉత్కంఠ నెలకొంది. గురువారం చెన్నై చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో AIADMK, BJP కలిసి పోటీ చేస్తామని విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ సందర్భంగా AIADMK చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి (EPS), తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై ఒకే వేదికను పంచుకున్నారు.

"ఈ ఎన్నికలను జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ (PM Modi) నడిపిస్తారు. తమిళనాడులో EPS, AIADMK నాయకత్వం వహిస్తాయి" అని షా అన్నారు. 1998 నుంచి అన్నాడీఎంకే ఎన్డీఏలో భాగమని, మోదీ, మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత గతంలో కలిసి పనిచేశారని షా గుర్తుచేశారు.

ఇటు నైనార్ నాగేంద్రన్ (Nainar Nagendran) తమిళనాడు బీజేపీ చీఫ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన పేరును అన్నామలైయే స్వయంగా ప్రతిపాదించారు. నాగేంద్రన్ ఎన్నిక ఇక ఏకగ్రీవమే. 

Tags:    

Similar News