కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబ సభ్యులతో విజయ్ సమావేశం?
చెన్నైలో కలుస్తారని TVK పార్టీ వర్గాల సమాచారం..
తమిళగ వెట్రీ కజగం (TVK) చీఫ్ విజయ్(Vijay) సోమవారం (అక్టోబర్ 27) చెన్నైలో లేదా సమీప తీరప్రాంత పట్టణం మామల్లపురంలో కరూర్ తొక్కిసలాట(Stampede) బాధితుల కుటుంబాలను కలవనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కరూర్‌లో సెప్టెంబర్ 27న టీవీకే ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుపుతోంది. వాస్తవానికి బాధిత కుటుంబాలను విజయ్ అక్టోబర్ 17న కరూర్‌లో పరామర్శించాలనుకున్నారు. అయితే ఆ రోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) బృందం కరూర్‌కు వస్తుండడంతో విజయ్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇటీవల విజయ్ ఇప్పటికే 39 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించారు. వీడియో కాల్స్ చేసి బాధిత కుటుంబాలతో మాట్లాడారు.