‘‘నేను లేకుండా ఆమె ఉండలేదని చంపేశా’’

కేరళ సామూహిక హత్యల నిందితుడు వాంగ్మూలం, ఆర్థిక, డ్రగ్స్ కోణంలో పోలీసుల విచారణ;

Update: 2025-03-02 13:00 GMT

కేరళలో సామూహిక హత్య కేసులో నిందితుడు అఫాన్ స్నేహితురాలు ఫర్సానా హత్య విషయంలో కీలక విషయాలు వెల్లడించాడు. తను చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నామని, నేను లేకపోతే తాను జీవించి ఉండలేదని భావించి చంపేశానని విచారణ సందర్భంగా చెప్పినట్లు తెలిసింది.

ఫిబ్రవరి 24న నిందితుడు అఫాన్ తన కుటుంబ సభ్యులకు చెందిన ఐదుగురిని పాశవికంగా హత్య చేశాడు. ఇందులో కుటుంబ సభ్యులతో పాటు అతని స్నేహితురాలు కూడా ఉంది.
ఆమెతో నిందితుడికి పాఠశాల రోజుల నుంచి పరిచయం ఉంది. ‘‘నేను లేకుండా ఆమె ఒంటరిగా జీవించలేదు’’ అందుకని చంపేసినట్లు పోలీసులకు చెప్పాడు.
పోస్ట్ గ్రాడ్యూయేట్ అయిన ఫర్సానా నేరం జరిగిన రోజు ట్యూషన్ కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి అఫాన్ ను కలవడానికి వెళ్లింది. అఫాన్ ను కలిసిన తరువాత తన ఇంట్లోని గదిలోకీ తీసుకెళ్లిన నిందితుడు పదునైన ఆయుధంతో ఆమె పై దాడి చేశాడు. తరువాత ముఖాన్ని కత్తితో చెక్కి వేశాడు.
పోలీసుల నివేదిక..
ప్రాథమిక నివేదికల ప్రకారం.. అఫాన్ తన తల్లి, తమ్ముడితో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగా అఫాన్ తన 88 ఏళ్ల అమ్మమ్మ, 13 ఏళ్ల సోదరుడు, స్నేహితురాలు, మామ, అతడి భార్యను హత్య చేశాడు.
నేరం చేసిన తరువాత అతను వెంజరమూడు పోలీస్ స్టేషన్ లో లొంగి పోయాడు. తరువాత విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి శుక్రవారం ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది.
ఆర్థిక సమస్యలు..
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం అఫాన్ కుటుంబం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. దీంతో అతడు కుటుంబం మొత్తాన్ని హత్య చేయాలని నిర్ణయానికి వచ్చాడు.
అతను చాలామంది దగ్గర రూ. 65 లక్షల రుణం తీసుకున్నాడు. అదే సమయంలో సౌదీ అరేబియాలో తన తండ్రి వ్యాపారంలో విపరీతంగా నష్టాలు రావడంతో కుటుంబ పరిస్థితి మరింత దిగజారింది.
తన తల్లి షేమినా చనిపోవడానికి తానే కారణం అని అఫాన్ నమ్మడంతో ఈ హత్యకు బీజం పడింది. తరువాత వెళ్లి అమ్మమ్మ సల్మా బీవీ ఇంటికి వెళ్లే ముందు సుత్తిని కొనుగోలు చేశాడు.
ఆమె బంగారు గొలుసు ఇవ్వమని అడగాడు. అందుకు వృద్దురాలు నిరాకరించడంతో తలపై సుత్తితో కొట్టి చంపేశాడు. తరువాత మామ లతీఫ్ ఇంటికి వెళి ఆర్థిక సాయం కోరాడు. వారు కూడా నిరాకరించడంతో అత్త, మామ ఇద్దరిని చంపేశాడు.
తరువాత ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అయితే సోదరుడు, స్నేహితురాలు ఒంటరిగా ఉంటారని భావించి వారిని సైతం హత్యచేశాడు.
ఏం ఇబ్బందులు లేవు: నిందితుడి తండ్రి
సౌదీ నుంచి తిరిగి వచ్చిన అనంతరం అఫాన్ తండ్రి మాట్లాడుతూ.. మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని అన్నారు. ఈ సంఘటనలో ప్రాణాలతో బయటపడిన తన తల్లి కోలుకుంటోందని, కానీ జరిగిన విషయాలు ఆమెకు గుర్తు చేసుకోవడంలో ఇబ్బందిపడుతుందని అంటున్నారు.
ఈ స్టేట్ మెంట్ నేపథ్యంలో పోలీసులు ఇందులో మాదక ద్రవ్యాల వాడకం, అఫాన్ మానసిక స్థితి కోణంలో విచారణ చేస్తున్నారు. మొత్తానికి ఈ హత్యలు కేరళలో వాడీవేడీ చర్చలకు దారితీసింది.
Tags:    

Similar News