వాసవి గ్రూప్ సంస్థలపై ఐటీ సోదాలు..

బంగారం కొనుగోళ్లలో అవకతవకలు జరాగయన్న ఆరోపణలపై సోదాలు.;

Update: 2025-09-17 11:13 GMT

హైదరాబాద్‌లోని క్యాప్స్ గోల్డ్ కంపెనీపై ఐటీ అధికారులు దాడులు చేశారు. సికింద్రాబాద్ కాళాసిగూడ‌లోని క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి క్యాప్స్ గోల్డ్ కంపెనీ భారీ మొత్తంలో బంగారం కొనుగోలు చేసి దానిని రిటైల్ గోల్డ్ షాప్స్‌కు అమ్ముతోంది. ఈ క్రమంలోనే క్యాప్స్ గోల్డ్ కంపెనీకి హోల్సేల్‌గా ఉన్న సంస్థలపై ఐటీ సోదాలు చేస్తోంది. క్యాప్స్ గోల్డ్ కంపెనీ ఐటీ చెల్లింపుల్లో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు ఈ సోదాల్లో గుర్తించారు. దాదాపు 15 బృందాలతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బంజారాహిల్స్‌లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి.

మరోవైపు రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి గ్రూప్స్ కార్యాలయాలపై కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వాసవి గ్రూప్స్‌కు క్యాప్స్ గోల్డ్ సంస్థ అనుబంధంగా ఉన్నట్లు ఐటీ గుర్తించింది. ఈ క్రమంలోనే సోదాలు చేస్తున్నట్లు సమాచారం. వాసవి సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న అభిషేక్, సౌమ్య కంపెనీలపై కూడా రైడ్స్ నిర్వహించింది ఐటీ సిబ్బంది. క్యాప్స్ గోల్డ్‌లో కూడా అభిషేక్ ,సౌమ్య డైరెక్టర్‌గా ఉన్నారు. వాసవికి సంబంధించిన 40 కంపెనీలకు సంబంధించిన దానిపై ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News