‘‘సీబీఐ కేసులో ఈడీ స్వతంత్య్రంగా ఎందుకు దర్యాప్తు చేయాలి’’
మద్రాస్ హైకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసిన తమిళనాడు మంత్రి సోదరుడు, బ్యాంకును ముప్పై కోట్లకు మోసం చేసినట్లు రవిచంద్రన్ పై సీబీఐ కేసు;
Translated by : Chepyala Praveen
Update: 2025-04-16 06:34 GMT
(మూలం.. మహాలింగం పొన్నుస్వామి)
తమిళనాడు మున్సిపల్ మంత్రి కేఎన్ నెహ్రూ సొదరుడు, ట్రూ వాల్యూ హోమ్స్(టీవీహెచ్) అధినేత ఎన్. రవిచంద్రన్ తనపై నమోదు అయిన సీబీఐ కేసును కొట్టివేయాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.
ఆయనపై బ్యాంకును రూ. 30 కోట్లకు మోసం చేశారని కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ ఎంటర్ అయింది. ఈకేసును దర్యాప్తు చేయడానికి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
జస్టిస్ నిర్మల్ కుమార్ కేంద్ర దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన్ పిటిషన్ పై జూన్ 12 లోపు తమ అభిప్రాయం చెప్పాలని సూచించారు.
స్వతంత్య్ర దర్యాప్తు
కోర్టు ముందు తన అభ్యర్థనను సమర్పించిన ఈడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ రమేష్ వాదనలు వినిపిస్తూ.. రవిచంద్రన్ పై సీబీఐ కేసు ఆధారంగా ఏజెన్సీ స్వతంత్య్ర మనీలాండరింగ్ దర్యాప్తు నిర్వహించిందని న్యాయమూర్తికి తెలియజేశారు.
వ్యాపారం పేరుతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును రూ. 30 కోట్లకు మోసం చేసినట్లు రవిచంద్రన్ పై సీబీఐ కేసు ఫైల్ చేసింది. అయితే తనపై ఉన్న కేసును కొట్టివేయాలని రవిచంద్రన్ విజ్ఞప్తిపై కోర్టు నిర్ణయానికి సాయపడేందుకు ఈడీ తన పరిశోధన ఫలితాలను అందించేందుకు ఎదురుచూస్తోందని రమేష్ అన్నారు.
ఈడీ దర్యాప్తులో కేసుకు సంబంధించిన అంశాలు బయటపడ్డాయని, అందువల్ల తమ(ఈడీ) జోక్యం సమర్థనీయమేనని రమేష్ కోర్టుకు తెలిపారు.
రాజకీయ చర్య: సలహదారులు
రవిచంద్రన్ తరపున సీనియర్ న్యాయవాదులు ఎన్ఆర్ ఇలాంగో, విక్రమ్ చౌదరి కేసు ఈడీ ఎంటర్ పై వాదనలు వినిపించారు. వీరు కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రమేయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
సీబీఐ కేసులో ఏజెన్సీ ఫిర్యాదుదారుడు కాదని, బాధితుడు కాదని వాదించారు. ఈడీ రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తోందని, దాని జోక్యాన్ని చట్టబద్దమైనదిగా కాకుండా రాజకీయ చర్యగా అభివర్ణించిందని ఇలాంగో ఆరోపించారు.
సీబీఐ కేసును అర్హతల ఆధారంగా కొట్టివేస్తే, రవిచంద్రన్ మనీలాండరింగ్ దర్యాప్తును ఉపసంహరించుకోవాలని ఈడీని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు.
అదుపు లేకుండా జోక్యం చేసుకోవడం న్యాయాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. అధికారిక పిటిషన్ లేకుండానే సీబీఐ కేసులో జోక్యం చేసుకునే హక్కును ఈడీ ప్రశ్నిస్తూ, స్థానిక పోలీసులు దాని స్వంత కేసులలో జోక్యం చేసుకోవడానికి ఏజెన్సీ అనుమతిస్తుందా అని చౌదరి ప్రశ్నించారు. ఏదైన జోక్యం మౌఖిక అభ్యర్థనలను కాకుండా సరైన విధానాన్ని అనుసరించాలని ఆయన పట్టుబట్టారు.
రవిచంద్రన్ ఎందుకు భయపడుతున్నారు?
దీనికి కౌంటర్ గా రమేష్ వాదిస్తూ.. రాజకీయ పక్షపాత ఆరోపణలను తోసిపుచ్చాడు. గతంలో ఇలాంటి కేసులలో ఈడీ జోక్యం చేసుకుని, ఈ కేసులో ఏజెన్సీ ప్రమేయం ఉందని రవిచంద్రన్ బృందం ఎందుకు భయపడుతుందో తెలుసుకోవాలని ఆయన అన్నారు.
ఈ క్వాష్ పిటిషన్ పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కావాలని సీబీఐ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే. శ్రీనివాసన్ అభ్యర్థించారు. ఈడీ జోక్యంపై నిర్ణయాన్ని కోర్టుకే వదిలేశారు.
రవిచంద్రన్ యాజమాన్యంలోని టీవీహెచ్ గ్రూప్ పై దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఇటీవల చెన్నై, తిరుచిరాపల్లి, కోయంబత్తూర్ అంతటా అనేక ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు.
మంత్రి నెహ్రూ స్వస్థలమైన తిరుచిరాపల్లిలో దర్యాప్తుకు సంబంధించిన ప్రాంగణాల్లో కూడా సోదాలు జరిగాయి. ఈ దాడులు రాజకీయ ప్రేరేపిత చర్య అని, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఈ దాడులను నిర్వహించిందని అధికార పార్టీ ఆరోపించింది.