అబద్ధాలు చెబితే చరిత్ర మారదు: రాహుల్

రాజకీయ వేదికల నుంచి అబద్ధాలు చెప్పినంత మాత్రాన చరిత్ర మారదని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘ముస్లిం లీగ్ ముద్ర’ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే దాడులు చేస్తున్న నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-10 08:54 GMT
రాజకీయ వేదికల నుంచి అబద్ధాలు చెప్పినంత మాత్రాన చరిత్ర మారదని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘ముస్లిం లీగ్ ముద్ర’ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే దాడులు చేస్తున్న నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరుగా అభివర్ణించారు రాహుల్. భారతదేశాన్ని ఎప్పుడూ ఏకం చేసిన కాంగ్రెస్‌ ఒకవైపు, ప్రజలను విభజించేందుకు యత్నించే వారు మరోవైపు ఉన్నారని పేర్కొన్నారు.
"ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరు! ఒకవైపు భారతదేశాన్ని ఎప్పుడూ ఏకం చేసిన కాంగ్రెస్, మరోవైపు ప్రజలను విభజించడానికి ప్రయత్నించే వారు మరోవైపు ఉన్నారు" అని కాంగ్రెస్ మాజీ చీఫ్ ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు.

దేశాన్ని విభజించాలనుకునే శక్తులతో చేతులు కలిపి వారిని బలపరిచిన వారెవరో, దేశ సమైక్యత, స్వాతంత్య్రం కోసం పోరాడినవారెవరో చరిత్ర చూస్తే తెలుస్తుందన్నారు.

'క్విట్ ఇండియా ఉద్యమం' సమయంలో బ్రిటిష్ వారికి ఎవరు అండగా నిలిచారు? భారతదేశ జైళ్లు కాంగ్రెస్ నాయకులతో నిండిపోయినప్పుడు, దేశాన్ని విభజించిన శక్తులతో రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ మానిఫెస్టోలో ‘ముస్లిం లీగ్ ముద్ర’ ఉందని మోజీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. లోక్‌సభ ఎన్నికల్లో 180 సీట్లు మించి రావన్న భయంతో ప్రధాని “క్లిచ్డ్ హిందూ-ముస్లిం లిపిని” ఆశ్రయిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
1940 ప్రారంభంలో బెంగాల్‌లో ముస్లిం లీగ్‌తో కలిసి ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో జన్ సంఘ వ్యవస్థాపకుడు, అప్పటి హిందూ మహాసభ అధ్యక్షుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్వయంగా భాగమయ్యారని కాంగ్రెస్ బీజేపీకి ఎదురుదాడి చేసింది. దేశాన్ని విభజించాలనుకున్న శక్తులతో చేతులు కలిపేందుకు చరిత్రే సాక్షి అని అన్నారు.
Tags:    

Similar News