58 ఏళ్ల జీవోను రద్దు చేసిన కేంద్రం.. మధ్యప్రదేశ్ హైకోర్టు హర్షం..

ప్రధాని ఇందిరాగాంధీ 30 నవంబర్ 1966న ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరకుండా నిషేధం విధించారు. అసలు నిషేధించడానికి కారణమేంటి?

Update: 2024-07-26 12:05 GMT

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులపై నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఈ నిషేధాన్ని తొలగించాయి.

మధ్యప్రదేశ్ హైకోర్టు హర్షం..

కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మధ్యప్రదేశ్ హైకోర్టు హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వానికి దాదాపు ఐదు దశాబ్దాలు పట్టిందని కోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగి పురుషోత్తం గుప్తా దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను విచారించిన సుశ్రుత అరవింద్ ధర్మాధికారి, గజేంద్ర సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

"నిషేధం కారణంగా అనేక విధాలుగా దేశానికి సేవ చేయాలనే అనేక మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు ఈ ఐదు దశాబ్దాలలో తగ్గిపోయాయి. కోర్టు దృష్టికి తీసుకురావడం ద్వారా పరిష్కారం లభించింది" అని కోర్టు పేర్కొంది.

ఎందుకు నిషేధించారు?

‘‘1966 నవంబర్ 7న గోహత్యకు వ్యతిరేకంగా పార్లమెంటు వద్ద పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఆందోళనకు ఆర్‌ఎస్‌ఎస్-జనసంఘ్ లక్షల మంది మద్దతును కూడగట్టింది. పోలీసుల కాల్పుల్లో చాలా మంది చనిపోయారు. 30 నవంబర్ 1966న ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరకుండా నిషేధం విధించారు.

పిటిషనర్ సంతోషం..

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ నుంచి 2022లో పదవీ విరమణ చేసిన ఇండోర్‌కు చెందిన పిటిషనర్ గుప్తా కేంద్రం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. “సంఘ్ కార్యకలాపాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై నిషేధాన్ని ఎత్తివేయడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల నేను సంతోషిస్తున్నాను. నాలాంటి వేల మంది ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరడం ఇప్పుడు సులభమవుతుంది.’’ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా ఉండే నిబంధనను సవాల్ చేస్తూ గుప్తా గత ఏడాది సెప్టెంబర్ 19న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

Tags:    

Similar News