హైదరాబాద్ లో మరో మైనర్ బాలిక హత్య

బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో దుశ్చర్య;

Update: 2025-08-18 11:08 GMT

హైదరాబాద్ కూకట్ పల్లి లో మరో మైనర్ బాలిక(12) హత్యకు గురైంది. హత్యకు ముందు రేప్ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుటుంబంలో తల్లిదండ్రులిద్దరూ ప్రయివేటు ఉద్యోగస్తులు. డ్యూటీ కోసం ఆఫీసుకు బయలు దేరారు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో జొరబడి హత్య చేసినట్టు తెలుస్తోంది.

మైనర్ బాలిక హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాలిక ఇంట్లో నుంచి నడుచుకుంటూ బయటకు వస్తున్న యువకుడి విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి. బాలికను రేప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రతిఘటించడంతో యువకుడు హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఘటనా స్థలికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరిస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం రావల్సి ఉంది.

గత సంవత్సరం నవంబర్ లో మియాపూర్ కు చెందిన మైనర్ బాలిక హత్యకు గురైంది.మియాపూర్ కు చెందిన ఓ కుటుంబం తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనకు 20 రోజుల క్రితం తమ కూతురు స్నేహితుడు చింటు దగ్గరకు వెళ్లిందని తల్లిదండ్రులు చెప్పారు. కుమార్తె ఫోన్‌ చేయడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఫిర్యాదులో చింటు అనే యువకుడి పై అనుమానం కూడా వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. చింటుతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు గుట్టు రట్టయ్యింది.

ఆ బాలికని చింటు పాతబస్తీ ఉప్పుగూడలోని తన స్నేహితుడు సాకేత్‌ ఇంట్లో ఉంచాడని మియాపూర్ పోలీసులు తెలిపారు. బాలికను పెళ్లి చేసుకోవాలని చింటు బలవంతం చేశాడని పోలీసులు పేర్కొన్నారు. చింటు చంపేస్తానని బెదిరించడంతో బాలిక పెళ్లి చేసుకుందని పోలీసులు చెప్పారు. దండలు మార్చుకున్న విషయం బాలిక ఇంట్లో వాళ్లకు ఫోన్‌ చేసి చెప్పిందని పోలీసులు తెలిపారు.ఇదంతా పథకం ప్రకారమే చింటు నాటకం ఆడినట్టు పోలీసులు చెప్పారు. బాలిక మర్డర్ ప్లాన్ చింటు స్నేహితుడు సాకేత్‌, సాకేత్‌ భార్యకు చెప్పాడని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు కలిసి బాలికను దిండుతో తలపై మూసి హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం శవాన్ని శ్రీశైలం మార్గంలో నిర్మానుష్య ప్రాంతాల్లో పడేశారు. దర్యాప్తులో చింటునే హత్య చేశాడని తేలినట్లు పోలీసులు తెలిపారు.

మైనర్ బాలికలపై హత్యాచారాలు పెరిగిపోవడంతో నిందితులను కఠినంగా శిక్షిస్తే ఇటువంటివి పునరావృతం కావని ప్రజా సంఘాలు అంటున్నాయి.

Tags:    

Similar News