‘మా నిరంతరం పోరాటం వల్లే కేంద్రం దిగొచ్చింది’

కులగణనను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్న హస్తం పార్టీ..;

Update: 2025-05-04 15:06 GMT
Click the Play button to listen to article

కేంద్ర ప్రభుత్వం కుల గణనకు ఆమోదమయితే తెలిపింది. కాని ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందో ఖచ్చితంగా చెప్పలేదు. దాంతో కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఒత్తిడి చేస్తోంది. టైమ్‌లైన్ వెల్లడించాలని పట్టుబడుతోంది. ఇదే సమయంలో తాము చాలా ఏళ్లుగా ఒత్తిడి చేస్తుండడంతో కేంద్రం దిగివచ్చిందని హస్తం పార్టీ(Congress) ప్రచారం చేసుకుంటుంది.

‘‘బీజేపీ (BJP) కుల గణకకు వ్యతిరేకమని ప్రజలకు తెలుసు. అయితే ఈ కార్యక్రమం చేపట్టాలని గత 11 ఏళ్లుగా రాహుల్ గాంధీ (Rahul Ganghi), కాంగ్రెస్ కోరుతున్నారు. మా పార్టీ ఒత్తిడి వల్లే కేంద్రం దిగొచ్చింది. బీజేపీ దీన్ని మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయంగా చూపించే ప్రయత్నం చేస్తుంది,’’అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ‘ది ఫెడరల్’తో అన్నారు.

‘గ్రామసభలు నిర్వహించండి’

మే 2న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో పార్టీ మరో నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి (సంఘటన) కే.సి. వేణుగోపాల్ రాష్ట్ర, జిల్లా యూనిట్లకు ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ఒత్తిడి వల్లే కేంద్రం తలొగ్గిందని చెప్పడమే లక్ష్యంగా గ్రామసభలు నిర్వహించాలని చెప్పినట్లు సమాచారం. రాహుల్ గట్టిగా నిలబడడంతోనే భూసేకరణ బిల్లులో మార్పులు వెనక్కి తీసుకోవడం, రైతు చట్టాల రద్దు, తాజాగా కుల గణాంకాలను ఒప్పుకోవడం జరిగాయని ఖర్గే, జైరాం రమేష్, సచిన్ పైలట్ వంటి నేతలు ప్రజలకు గుర్తు చేస్తున్నారు.

తెలంగాణ(Telangana) మోడల్‌ బాగుందన్న రాహుల్..

కుల గణాంకాల నిర్వహణలో తెలంగాణ మోడల్ ఉత్తమంగా ఉందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. బీహార్ మాదిరి కంటే తెలంగాణలో అనుసరించిన విధానం బాగుందని రాహుల్ గాంధీ మెచ్చుకున్నారు.

బీహార్‌లో నిర్వహించిన సర్వే వల్ల ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు ప్రయోజనాలు తక్షణ అందలేదని ఆయన విమర్శించారు. భారతదేశ ముస్లింలలో 80 శాతానికి పైగా ఉన్న పస్మందా ముస్లింలను వెనుకబడిన వర్గాలుగా గుర్తించి, రిజర్వేషన్ ప్రయోజనాలు ఇవ్వాలన్న బీజేపీ వ్యూహాన్ని కాంగ్రెస్ తిప్పికొట్టాలని చూస్తోంది. 

Tags:    

Similar News