బీహార్‌లో మోదీ ఎన్డీఏ ప్రచార నినాదం..

'బనాయేంగే నయా బీహార్, ఫిర్ ఏక్ బార్ ఎన్‌డీఏ సర్కార్'..ఎన్‌డీఏ గెలిపిద్దాం.. కొత్త బీహార్‌ను నిర్మించుకుందాం..;

Update: 2025-07-18 13:36 GMT
Click the Play button to listen to article

కాంగ్రెస్(Congress)-ఆర్జేడీ(RJD) కూటమి ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు ప్రధాని మోదీ. బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన శుక్రవారం మోతిహరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ఉద్యోగాల ఇస్తామని చెప్పి భూములు రాయించుకున్న ఘనత RJDకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్-ఆర్జేడీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు.

NDA ప్రచార నినాదం..

'బనాయేంగే నయా బీహార్, ఫిర్ ఏక్ బార్ ఎన్‌డీఏ సర్కార్' (ఎన్‌డీఏ గెలిపిద్దాం.. కొత్త బీహార్‌ను నిర్మించుకుందాం.) అనే కొత్త నినాదం ఇచ్చారు ప్రధాని. మోదీ నినాదం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.

తూర్పు భారతదేశ సమగ్రాభివృద్ధికి 'వికసిత్ బీహార్' ముఖ్యమైనదని చెప్పారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధానీ.. గత 45 రోజుల్లో బీహార్‌లోని 24,000 స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం రూ.1,000 కోట్లు విడుదల చేసిందని గుర్తుచేశారు.

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని, వీటిలో ఒక్క బీహార్‌లోనే 60 లక్షలు నిర్మించామని మోదీ అన్నారు.

Tags:    

Similar News