తన వైఫల్యాలను అంగీకరిస్తూనే.. దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారా?

కేంద్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్ ను మంగళవారం లోక్ సభ లో ప్రవేశపెట్టింది. దీనిని నితీష్, నాయుడు బడ్జెట్ గా విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే, కొన్నింటిని తమ..

Update: 2024-07-24 08:24 GMT

పరిపాలన, విధానపరమైన వైఫల్యాలను అంగీకరించడం ప్రధాని నరేంద్ర మోదీకి అంతగా ఇష్టముండదు. అయితే తన రాజకీయ చాతుర్యాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నికల డైనమిక్స్ గా మార్చడంలో మాత్రం ముందుంటారు. మంగళవారం (జూలై 23), కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్తగా పునర్నిర్మించిన NDA ప్రభుత్వపు మొదటి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు.

బడ్జెట్ ద్వారా బీజేపీని ఎన్నికల్లో ఉత్సాహంగా ఉంచుకోవడానికి తన ప్రధానమంత్రి కుర్చీని సురక్షితంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తన ప్రభుత్వ విధానాలు, రాజకీయాలు తక్షణమే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని, ఇది తనకు ఇష్టం లేకపోయినా, అందుకు అంగీకరించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు కనిపించాయి.

నితీష్, నాయుడును సంతోషపరచడానికే..
గత దశాబ్దంలో నిరుద్యోగం, రైతుల అశాంతి, రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా పెరగడంతో, ప్రధానమంత్రిని, ఆయన విధానాలను స్వపక్షంలోనే వారు విమర్శించారు. కానీ అప్పుడు బీజేపీ సొంతకాళ్లపై నిలబడి ఉండేది.ఎన్నికల్లో ఉత్సాహాంగా పోరాడేందుకు సిద్ధంగా ఉండేది. 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించి సగానికి పైగా రాష్ట్రాల్లో న్యాయంగా, అన్యాయంగా నియంత్రణ సాధించారు. 
అయితే, 2024 లోక్‌సభ ఎన్నికలు, బహుళ కోణాల సామాజిక-ఆర్థిక సంక్షోభాల వల్ల ప్రతిపక్షాన్ని ఏకం చేయడంతో బీజేపీ మెజారిటీని తగ్గించింది. JD (U) చీఫ్ నితీష్ కుమార్, TDP అగ్రనేత N. చంద్రబాబు నాయుడి నమ్మశక్యం కాని అండదండలతో మోదీ తిరిగి ప్రధానమంత్రిగా కుర్చీ ఎక్కగలిగారు.
ఎన్నికల ఫలితాల తరువాత ఎన్డీఏ పక్షాలలో సరిగా పొసగటం లేదని వార్తలు వచ్చాయి. కేంద్రమంత్రిమండలిలో తమ పార్టీకే అన్ని కీలక మంత్రిత్వ శాఖలు కేటాయించి, భాగస్వామ్య పక్షాలకు తక్కువ ప్రాధాన్యం ఉన్న శాఖలు కేటాయించారు. మోదీ గత పాలనలో మెజారిటీ తగ్గించినప్పటికీ వారికే ఈ శాఖలు కేటాయించారు.
అయితే, లోక్‌సభ ఫలితాలు వెలువడిన రెండు నెలల్లోనే మోదీ ప్రభుత్వం ఎన్నికల తీర్పు, NDA సంకీర్ణంలో మారిన రాజకీయ సమీకరణాల నుంచి పాఠాలు నేర్చుకుని కనీసం పాక్షికంగానైనా తన ప్రాధాన్యతలను మార్చుకుందని సీతారామన్ బడ్జెట్‌ సూచించింది.
బిహార్, ఆంధ్రప్రదేశ్‌పై బడ్జెట్‌లో అసమానమైన అధిక దృష్టి, ఇతర రాష్ట్రాల నాయకులకు కోపం తెప్పించింది. నితీష్, చంద్రబాబులను మచ్చిక చేసుకోవడంలో మోదీ తన వంతు ప్రయత్నాలు చేశారని చెప్పవచ్చు. తాను విధిలేని పరిస్థితుల్లోనే మిత్ర పక్షాలకు లొంగాల్సి వచ్చిందని మోదీ కొత్తగా ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఉద్యోగాల కల్పన, పన్ను సంస్కరణలు, వ్యవసాయ సంక్షోభం వంటి సమస్యలను పరిష్కరించడంలో గతంలోని తన ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియకుండానే, ప్రకటించకుండానే అంగీకరించారు.
'ప్రాధాన్యాలు' విత్త మంత్రి విస్తృతమైన సూచన
ప్రతి కేంద్ర బడ్జెట్ తర్వాత ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తాయి. ఈ లెక్కన మంగళవారం కూడా జరిగిందని అనుకోవచ్చు. కాంగ్రెస్ సహ ప్రధాన విపక్షాలన్నీ కూడా బడ్జెట్ ను నితీష్, నాయుడు బడ్జెట్ గా విమర్శించాయి. కేవలం రెండు రాష్ట్రాలకే నిధులన్నీ కూడా కేటాయించారని, మిగిలిన 28 రాష్ట్రాలకు అన్యాయం చేశారని ఇండి కూటమి పక్షాలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ రాష్ట్రాలకు ఆర్థిక గ్రాంట్లను కేటాయించడం ద్వారా తమ ప్రభుత్వ సుస్థిరతను కాపాడుకునే ప్రయత్నం జరిగిందనేది సుస్పష్టం. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి, ఆర్థిక అసమానతలను తగ్గించడానికి, ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో సవతి తల్లిగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని ఇలా అనేక రకాలైన ఆరోపణలు సాధారణంగా వినిపిస్తున్నాయి.
అటువంటి విమర్శలు ఖచ్చితమైనవిగా ఉన్నా, గుర్తుకు రానివిగా లేదా అతిశయోక్తిగా ఉన్నాయా అనే దానితో సంబంధం లేకుండా, యూనియన్ బడ్జెట్‌లో సీతారామన్ ఉపాధి, తదుపరి తరం సంస్కరణలు, తయారీ మరియు పన్ను సంస్కరణల “ప్రాధాన్యత” గురించి విస్తృతంగా ప్రస్తావించారు.
ఆర్థిక మంత్రి 85 నిమిషాల నిడివి గల బడ్జెట్ ప్రసంగం ప్రతిపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయుధంగా మారిందనే చెప్పాలి. పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రభుత్వం విఫలం అయిందని చెప్పవచ్చు. రైతులకు స్పష్టంగా ఎంఎస్పీ ప్రకటించాలనే డిమాండ్ బడ్జెట్ ను విడిచిపెట్టిందని ప్రతిపక్షాల ఆరోపిస్తున్నాయి.
కాపీ-పేస్ట్ చేయడం
దేశాన్ని కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాలించి ఏమి చేయలేదని ఎన్నికల ప్రచారంలో బీజేపీ విమర్శించింది. ఇప్పుడు ఇదే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లభించింది. మోదీ ప్రభుత్వం సుదీర్ఘకాలం దేశాన్ని పాలించి ఏం చేసిందనే అడిగే స్థాయికి బీజేపీ చేరింది. తమ పథకాలను బీజేపీ ప్రభుత్వం కాపీ పేస్ట్ చేసిందని కూడా కాంగ్రెస్ ప్రచారం చేసుకునే అవకాశం ఈ బడ్జెట్ కల్పించింది.
చాలా మందికి ఈ బడ్జెట్ లో నచ్చిన అంశం ఏంటంటే.. ఏంజేల్ టాక్స్ ను రద్దు చేయడం, సూక్ష్మ, చిన్న స్థాయి పరిశ్రమలకు నిధుల కేటాయింపు, ఉద్యోగ కల్పనను పెంపొందించడానికి ప్రైవేట్ రంగంలో ఉపాధి ఆధారిత ప్రొత్సాహాకాలతో ఇంటర్న్ షిప్ పథకాలను ప్రవేశపెట్టడం కొంచెం ప్రాముఖ్యత నిచ్చే అంశంగా చెప్పవచ్చు. ఈ చర్యలకు కాంగ్రెస్ షరతులతో కూడిన ప్రశంసలు ఉన్నప్పటికీ, ఈ నిర్ణయాలు రాహుల్ గాంధీకి అతని పార్టీకి చాలా ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయి. ఇందులో చాలా అంశాలు కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హమీ ఇచ్చినవి కావడం గమనార్హం.
కాంగ్రెస్ నాయకులు, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం నుంచి పార్టీ కమ్యూనికేషన్స్ చీఫ్ జైరాం రమేష్ వరకు, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని అనేక మంది నాయకులు ఈ ప్రభుత్వం తమ అంశాలను కాపీ చేశారని చెప్పడంలో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ, MSME రంగానికి సాయం చేయవలసిన అవసరాన్ని సీతారామన్ విస్తృతంగా ప్రస్తావించడం “రాహుల్ గాంధీ గత మూడేళ్లుగా చెబుతున్న దానికి నిరూపణ... MSME తయారీ, ఉద్యోగాల కల్పనకు వెన్నెముక అని. ప్రభుత్వం వాటిని నాశనం చేయడానికి బదులు సాయం చేయాలి.
మద్ధతు ధర కోసం ఇండి బ్లాక్..
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ పుష్పేంద్ర సరోజ్ కేంద్ర బడ్జెట్‌ను మోదీ ప్రభుత్వం " మాఫినామా " (క్షమాపణ లేఖ)గా అభివర్ణించారు, ఆర్థిక మంత్రి "ఉద్యోగాల కల్పన, MSMEలను బలోపేతం చేయడం, వాటి పటిష్టత గురించి విపక్షాల వాదనలను ఆచరణాత్మకంగా అంగీకరించారు. జీఎస్టీ, కొత్త ఆదాయపు పన్ను విధానాలు అన్నీ అబద్ధాలే. ‘‘గత కొన్నేళ్లుగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నవన్నీ నిజమయ్యాయి.
నేడు, ఆర్థిక మంత్రి ఆలస్యంగా ఉద్యోగాల కల్పన, GST, పాలన, కొత్త ఆదాయపు పన్ను విధానాలను సరళీకృతం చేయడం కోసం సగం చర్యలు తీసుకున్నారు. ప్రతిపక్షాల మాటను ప్రభుత్వం ఆలకించి ఉంటే ఇంతకు ముందే ఇదంతా సక్రమంగా జరిగేది. ఇప్పుడు కూడా వారి ప్రకటనలు అరకొరగానే ఉన్నాయి కానీ కనీసం ఈ రంగాలలో సంక్షోభాల గురించిన గుర్తింపు ఉంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ప్రతిపక్షాల నిర్మాణాత్మక విమర్శలను వింటుందని మేము ఆశిస్తున్నాము, ”అని సరోజ్ అన్నారు.
ఎమ్‌ఎస్‌పికి చట్టపరమైన హామీ, అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయడం, జిఎస్‌టి పాలనను మరింత సరళీకృతం చేయడం, ఉపాధి కల్పన పథకాలను మరింత మెరుగ్గా రూపొందించడం “ప్రతిపక్షంతో సహా అన్ని రాష్ట్రాల పట్ల మరింత సమదృష్టితో వ్యవహరించడం” వంటి డిమాండ్లను ఇండి కూటమి నాయకులు కొనసాగిస్తారని ప్రతిపక్ష వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Tags:    

Similar News