మీ సీట్లు గ్యారెంటీ

తాజా రాజకీయాలపై బాబు చర్చ ప్రకాశం, బాపట్ల జిల్లాల టిడిపి ఇన్‌చార్జ్‌లతో ప్రత్యేక సమావేశం

Update: 2023-12-09 14:15 GMT
ప్రకాశం, బాపట్ల జిల్లాల టీడీపీ ముఖ్యనాయకులతో చంద్రబాబు సమావేశం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ప్రకాశం, గుంటూరు జిల్లాల టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, టిడిపి ఎమ్మెల్యేలతో శనివారం సమావేశమయ్యారు. బాపట్ల జిల్లాలోని తుపాన్‌ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ఆయన పర్యటనకు బయలుదేరే ముందు నాయకులతో తాజా రాజకీయాల గురించి మాట్లాడారు. రెండు జిల్లాల్లో పరిస్థితులు ఏమిటని, ఏనియోజకవర్గంలో పార్టీల ప్రభావం ఎలా ఉంటుందని నాయకులను ప్రశ్నించారు. మనం గెలిచి తీరాలని వారికి ఉద్బోధ చేశారు. పర్చూరులో ఒక పెద్ద అవినీతి పరుడిని వైసిపి తెచ్చి పెట్టింంది. డబ్బులు కుమ్మరిస్తారు. జాగ్రత్త అంటూ సంకేతాలిచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఓట్ల తొలగింపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేలతో పాటు కొందరు ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మీ నియోజకవర్గాలను బాగా చూసుకోండి. మీకు సీట్ల విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఏవైనా కారణాలతో సీటు ఇవ్వలేకపోతే వారిని నేను వేరే విధంగా చూసుకుంటా. నన్ను నమ్మండని అన్నారు.

తుపాన్‌ వల్ల జరిగిన నష్టం వివరాలు నియోజకవర్గాల వారీగా అడిగి తెలుసుకున్నారు. మద్దిపాడు మండలంలోని గుళ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడంపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. రైతులకు జరిగే నష్టాని ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలని నాయకులకు పిలుపు నిచ్చారు.


Tags:    

Similar News