ఐపీఎల్ లో కోటీశ్వరులు IPL Countdown-6

2025 మార్చి 22 తారీఖున మొదలయ్యే 18 వ సీజన్(ఎడిషన్), మే 25న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది.;

Update: 2025-03-17 12:09 GMT

ఐపిఎల్ అంటే కోట్లు కురిపించే టోర్నమెంట్. బీసీసీఐ కి కొన్ని వేల కోట్లు సంపాదించే కామధేనువు. అయితే ఇది కొంతమంది ఆటగాళ్లకు కూడా కోట్లు సంపాదించగలిగే అవకాశం ఉన్న వేదిక. ప్రతిభావంతమైన ఆటగాళ్లు కూడా కోట్లు సంపాదించగలిగే అవకాశం ఉన్న క్రికెట్ వేదిక ఇది.

ఐపీఎల్ లో మూడు రకాల ఆటగాళ్లు ఉంటారు.

1. వేలంపాటలో ఫ్రాంచైజీలు కొనుక్కున్న ఆటగాళ్లు

2. ఫ్రాంచైజీలు గత సీజన్ తమ జట్టు లో ఆడిన ఆటగాళ్లు

3. అన్ క్యాప్డ్(uncapped) ఆటగాళ్లు. అంటే తమ జట్టులోనే ఉండి భారత జట్టులో ఒక్క టెస్ట్ మ్యాచ్ కానీ, వన్డే గాని టి20 మ్యాచ్ కానీ ఆడని వాళ్ళు. ఈ నిబంధన ఇప్పుడు మారింది. ఇంతకుముందు మీరు ఫ్రాంచైజీ కు ఆడి ఉంటే, ఇద్దరిని జట్టులో రిటైన్ చేయవచ్చు (అంటే అట్లా పెట్టుకోవచ్చు). దీనివల్ల చెన్నై సూపర్ కింగ్స్ టీం కేవలం నాలుగు కోట్ల రూపాయల శాలరీ(జీతం) తో జట్టులో ఉంచుకోవచ్చు

ఆటగాళ్ల జీతభత్యాలు ముందే నిర్ణయించబడతాయి. ఫ్రాంచైజీలు వేలంపాటలో కొనుక్కున్న ఆటగాళ్లకు ఎంత జీతం ఇస్తారో ముందే నిర్ణయించబడుతుంది. వారు ఒక్క మ్యాచ్ ఆడకపోయినా సరే అది చెల్లించాలి. అయితే ప్రతి ఆటగాడికి ఒక మ్యాచ్ కి ఏడున్నర లక్షల రూపాయలు ఇస్తారు. ఇది భత్యం. ఇంకా ఇతర సౌకర్యాలు అన్ని ఉంటాయి.

అత్యంత ఖరీదైన ఆటగాడు రిషబ్ పంత్.

2025 ఎడిషన్ వేలంపాటలో కోట్లు పలికిన ఆటగాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిలో అత్యంత ఖరీదైన ఆటగాడు రిషబ్ పంత్. 27 కోట్లకు కొనుక్కున్నారు లక్నో సూపర్ జైన్స్ జైన్స్ ఫ్రాంచైజీ వారు. వికెట్ కీపర్, ఎడమ చేతి బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్, కొంతకాలం పాటు క్రికెట్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఒక పెద్ద యాక్సిడెంట్లో గాయపడ్డ చాలా కాలం పాటు క్రికెట్ కి దూరంగా ఉన్నాడు. అయినప్పటికీ ఒక మ్యాచ్ ను వంటి చేత్తో గెలిపించగల సామర్థ్యం ఉన్న ఆటగాడిగా, అతన్ని లక్నో సూపర్ జెంట్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.

ఇంతవరకు ఐపీఎల్ లో ఇంత ధర పలికిన ఆటగాడు లేడు. రెండో స్థానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు చెందిన శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ లెవెన్ 26.75 కోట్లకి కొనుక్కుంది. మూడో స్థానంలో కలకత్తా నైట్ రైడర్స్ కొనుక్కున్న వెంకటేష్ అయ్యర్(23.75 కోట్లు) ఉన్నారు. తర్వాత స్థానంలో 18 కోట్లకు పంజాబ్ కింగ్స్ లెవెన్ హర్ష దీప్ సింగ్, యజువేంద్ర చాహల్ ఉన్నారు.

ఐపీఎల్ కోటీశ్వరులు

ఐపీఎల్ లో అత్యధిక వేతనాన్ని పొందిన వాళ్లలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఇంతవరకు అతను అందుకున్న వేతనం 178, 60,00,000 (అక్షరాల 178 కోట్ల అరవై లక్షలు). తర్వాత స్థానాల్లో...

2.మహేందర్ సింగ్ ధోనీ, 176,84,00,000

3. విరాట్ కోహ్లీ, 173,20,00,000

4. సురేష్ రైనా, 110,74,00,000

5. రవీంద్ర జడేజా 109,01,00,000

6. సునీల్ నరైన్(వెస్టిండీస్) 107,24,78,000 7. ఏబీ.డివిల్లీర్స్ 102,51,65,000

8. గౌతం గంభీర్ 94,62,00,000

9. దినేష్ కార్తీక్ 86,92,00,000

10. గ్లెన్ మ్యాక్స్ వెల్ 85,42,75,400

50 ఏళ్ల క్రితం ఒక టెస్టు మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు ఒక రోజుకి అందుకున్న భత్యం 100 రూపాయలు దాటలేదు!!

ఇప్పుడు కేవలం నాలుగు గంటల టి20 మ్యాచ్ కి ఒక ఆటగాడు అందుకునే భత్యం 7.5 లక్షలు

వివిధ జట్టు రిటైన్(తమ దగ్గరే పెట్టుకున్న) చేసిన ఆటగాళ్ల వివరాలు ఇవే.

చెన్నై సూపర్ కింగ్స్

రుతురాజ్ గైక్వాడ్, మతిషా పతి రానా, శివం దుబే, రవీంద్ర జడేజా, మహేందర్ సింగ్ ధోని

ఢిల్లీ క్యాపిటల్స్

అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టెప్స్, అభిషేక్ పోరెల్

గుజరాత్ టైటాన్స్

రషీద్ ఖాన్, శుభమన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవతియ , షారుఖ్ ఖాన్

కలకత్తా నైట్ రైడర్స్

సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్, హర్షిత్ రానా, రమన్దీప్ సింగ్

లక్నో సూపర్ జైంట్స్

నికోలస్ పూరన్, రవి బిష్ణోయి,మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్, ఆయుష్ బదోని

ముంబై ఇండియన్స్

జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ

పంజాబ్ కింగ్స్

షాషాంక్ సింగ్, ప్రభు సిమ్రన్ సింగ్

రాజస్థాన్ రాయల్స్

సంజు సాంసన్, యషస్వీ జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్ మేయర్, సందీప్ షర్మ.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

విరాట్ కోహ్లీ, రజిత పాటిదార్, యష్ దయాల్

సన్రైజర్స్ హైదరాబాద్

ఫ్యాట్ కమీన్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీ క్లాస్సేన్, ట్రావిస్ హెడ్

Tags:    

Similar News