"ఆకాశంలో సూర్యచంద్రులు, ఆంధ్రాలో బాబు, కళ్యాణ్‌బాబు"

మొదటి ఎపిసోడ్‌లోనే పవన్ ప్రస్తావన తీసుకొచ్చి మెగాభిమానుల్లో కూడా బాలయ్య ఆసక్తి రేకెత్తించారు. బాలయ్య అభిమానులతోపాటు పవన్ అబిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Update: 2024-10-22 07:27 GMT

చంద్రబాబు పవన్ కళ్యాణ్‌లను ఆకాశానికి ఎత్తేశారు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య. ఆకాశంలో సూర్యచంద్రులు ఎలాగో, ఏపీలో చంద్రబాబు, కళ్యాణ్ బాబు అలాగ అంటున్నారని చెప్పారు. కొత్తగా ప్రసారం కాబోతున్న ‘అన్‌స్టాపబుల్’ ఓటీటీ షోలో ఆయన ఈ మాటలు అన్నారు. ఈ షో నాలుగో సీజన్ ఈ నెల 25న రాత్రి 8.30కు ‘ఆహా’ ఓటీటీలో ప్రారంభం కాబోతోంది. మొదటి ఎపిసోడ్‌లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇంటర్వ్యూ చేశారు బాలయ్య. ఈ షో రెండో సీజన్ కూడా చంద్రబాబు ఇంటర్వ్యూతోనే ప్రారంభమయింది.

అన్‌స్టాపబుల్ తాజా ఎపిసోడ్ ప్రోమో ఆసక్తి రేకెత్తించేవిధంగా ఉంది. మా బావగారు, మీ బాబుగారు చంద్రబాబు నాయుడుగారు అంటూ సీఎమ్‌ను బాలయ్య ఆహ్వానించటం కనిపించింది. కక్ష సాధింపు రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చింది. తాను లక్ష్మణరేఖ దాటనని బాబు చెప్పుకొచ్చారు. అయితే ఎట్టి పరిస్థితులలోనూ తప్పు చేసినవారిని వదిలిపెట్టనని అన్నారు.


తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ, ఆకాశంలో సూర్యచంద్రులు, ఏపీలో చంద్రబాబు, కళ్యాణ్‌బాబు అంటున్నారు అని చెప్పారు. దానికి బాబు బదులిస్తూ, మీరు సినిమాల్లో అన్‌స్టాపబుల్ అయితే, మేము రాజకీయాలలో అన్‌స్టాపబుల్ అన్నారు.

మొదటి ఎపిసోడ్‌లోనే పవన్ ప్రస్తావన తీసుకొచ్చి అటు మెగాభిమానుల్లో కూడా బాలయ్య ఆసక్తి రేకెత్తించారు. దీనితో ఈ ఎపిసోడ్ కోసం బాలయ్య అభిమానులతోపాటు పవన్ అబిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆహా అనేది అల్లు అరవింద్, మైహోమ్ రామేశ్వరరావులు కలిసి స్థాపించిన ఓటీటీ అన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News