‘అవినీతిలో ఆ ఇద్దరికీ పోటీ’

ప్రధాని మోదీ జార్ఖండ్‌లోని బుధా పహాడ్‌లో తిరుగుబాటుదారులు, నక్సల్స్ నుండి విముక్తి చేయడంతో పాటు ఆదివాసీలకు న్యాయం చేశారని గుర్తుచేశారు కేంద్ర మంత్రి అమిత్ షా.

Update: 2024-05-24 12:40 GMT

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. జార్ఖండ్‌ను ఆ పార్టీ అవినీతి ఎటిఎంలా చూస్తోందన్నారు. రాష్ట్రంలో అవినీతిపై కాంగ్రెస్, హేమంత్ సోరెన్‌కు చెందిన జేఎంఎం పరస్పరం పోటీపడుతున్నాయని విమర్శించారు.

"కాంగ్రెస్‌కు జార్ఖండ్‌ ఓటు బ్యాంకు, ల్యాండ్‌ బ్యాంకు. హేమంత్‌ సోరెన్‌తో సహా అవినీతి జేఎంఎం నేతలు కాంగ్రెస్‌తో జతకట్టారు" అని షా ఆరోపించారు.

దుమ్కా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సీతా సోరెన్‌ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రధాని మోదీ జార్ఖండ్‌లోని బుధా పహాడ్‌లో తిరుగుబాటుదారులు, నక్సల్స్ నుండి విముక్తి చేయడంతో పాటు ఆదివాసీలకు న్యాయం చేశారని గుర్తుచేశారు. సోనియా-మన్మోహన్ హయాంలో గిరిజనులకు కేవలం రూ. 25,000 కోట్లు మాత్రమే కేటాయించగా.. దానిని ప్రధాని మోదీ పదేళ్లలో రూ.1.25 లక్షల కోట్లకు పెంచారని వివరించారు. జార్ఖండ్‌లో పశువుల అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోందని బీజేపీ నేత ఆరోపించారు. 

Tags:    

Similar News