తెలంగాణ ప్రజలకు ఐఎండీ చల్లటి కబురు

మండుతున్న ఎండలు..వడగాలుల ప్రభావంతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. ఎండతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షాలు ఊరట కలిగించనున్నాయి.

Update: 2024-05-05 07:16 GMT
తెలంగాణకు చల్లటి కబురు...వర్షాలు కురిసే అవకాశం

మండే ఎండలతో అల్లాడిన ప్రజలకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ కేంద్రం ఐఎండీ అధికారులు వెల్లడించారు. మరఠ్వాడ ప్రాంతంలో ఏర్పడిన సైక్లోనిక్ ప్రభావం కారణంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాలు కురవనున్న నేపథ్యంలో దక్షిణ తెలంగాణతోపాటు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతం 38 డిగ్రీల సెల్సియస్ కు తగ్గే అవకాశముందని ఐఎండీ శాస్త్రవేత్త ముకుందరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.


తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని, గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని ఐఎండీ అధికారులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ,రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
రెండవ రోజు మే 7 నుంచి 8వతేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులు వీచే అవకాశముంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని అధికారులు చెప్పారు. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిలాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

భారీ వర్షాలు కురిసే అవకాశం
రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ముకుందరావు చెప్పారు. హైదరాబాద్ నగరంలో మాత్రం ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఆయన పేర్కొన్నారు.


Tags:    

Similar News