ఓటు వేసిన ప్రముఖులు ఎవరంటే..

ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Update: 2024-05-25 12:29 GMT
రాంచీలో ఓటు వేసేందుకు వెళ్తున్న క్రికెటర్ థోని

ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ శనివారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

11.13 కోట్ల మంది ఓటర్లులో 5.84 కోట్ల మంది పురుషులు, 5.29 కోట్ల మంది మహిళలు, 5120 మంది థర్డ్ జెండర్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులు. ఎన్నికల సంఘం (ఈసీ) 1.14 లక్షల పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు 11.4 లక్షల మంది పోలింగ్ అధికారులను మోహరించింది.

ఓటు వేసిన ప్రముఖులు..


న్యూఢిల్లీలో ఓటు వేసిన తర్వాత  తమ సిరా వేళ్లను చూపుతున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ 



 కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.


కుటుంబసభ్యులతో ఓటు వేయడానికి వచ్చి ఓటరు ID కార్డులను చూపుతున్నఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, భార్య సునీతా కేజ్రీవాల్


న్యూఢిల్లీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తర్వాత బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మ


న్యూఢిల్లీలోని యమునా విహార్‌లోని పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేస్తున్న ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం అభ్యర్థి మనోజ్ తివారీ 


రాంచీలో ఓటు వేసిన జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నాయకురాలు కల్పనా సోరెన్ 


కురుక్షేత్ర జిల్లాలో ఓటు వేసిన కురుక్షేత్ర నియోజకవర్గ బిజెపి అభ్యర్థి నవీన్ జిందాల్, భార్య షల్లు జిందాల్ 


రోహ్‌తక్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన కాంగ్రెస్ నాయకుడు భూపిందర్ సింగ్ హుడా


అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహరాలో ఓటు వేసిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధ్యక్షురాలు, అనంత్‌నాగ్-రాజౌరీ నియోజకవర్గం అభ్యర్థి మెహబూబా ముఫీ


న్యూఢిల్లీలో ఓటు వేసిన నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్  

 



Tags:    

Similar News