‘ఆరోపణలు, అసత్య ప్రచారాన్ని జనం తిరస్కరించారు’

రాహుల్ గాంధీ, ఆయన తల్లి, కాంగ్రెస్ మాజీ అధినేత సోనియా గాంధీ న్యూఢిల్లీలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Update: 2024-05-25 07:17 GMT

ఇప్పటిదాకా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఆరోపణలు, అసత్య ప్రచారాన్ని తిరస్కరించారని, వాస్తవ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అన్నారు.

రాహుల్ గాంధీ, ఆయన తల్లి కాంగ్రెస్ మాజీ అధినేత సోనియా గాంధీ న్యూఢిల్లీలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత సిరా వేళ్లను చూపుతూ ఫొటోను షేర్ చేశారు.

రాహుల్ గాంధీ ఎక్స్‌లో ఏమని పోస్టు చేశారంటే..

"ఈ రోజు ఆరో విడత పోలింగ్ జరుగుతోంది. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ జరగబోతుంది. జాబ్ గ్యారంటీ స్కీంలో భాగంగా యువతకు ఏడాదికి లక్ష చొప్పున అందబోతోంది. పేద మహిళ కుటుంబానికి నెలకు రూ. 8,500 ఖాతాల్లోకి జమ కానుంది. రైతుల పంటలకు MSP దక్కబోతుంది. కూలీలు రోజుకు రూ.400 వేతనం పొందుతారు. ఈ విషయాలను ఓటర్లు దృష్టిలో ఉంచుకోవాలి’’ అని కోరారు.

మీ ఓటు మీ జీవితాన్ని మెరుగుపరచడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుంది’ అని ఆయన అన్నారు. అర్హులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.  

Tags:    

Similar News