ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయ చర్యలు ముమ్మరం, ప్రధాని మోదీ ఆరా
నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై సహాయచర్యలు ముమ్మరం చేశారు.ఈ ఘటన గురించి సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీశారు.;
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేసి సంఘటన గురించి ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి సీఎం తెలిపారు. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి వివరించారు.
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఆరా తీశారు. ముఖ్యమంత్రి గారు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రధానమంత్రి గారికి తెలియజేశారు.
— Telangana CMO (@TelanganaCMO) February 22, 2025
సొరంగంలో ఎనిమిది… https://t.co/3vWoe1AHux pic.twitter.com/8v9ekpAkiW