మణిపూర్‌లో 9 మంది ఉగ్రవాదుల అరెస్టు

ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం..;

Update: 2025-05-09 07:00 GMT
Click the Play button to listen to article

భారత్ - పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో .. నిషేధిత సంస్థలకు చెందిన తొమ్మిది మంది ఉగ్రవాదులను (Militants) మణిపూర్‌(Manipur)లో భద్రతా దళాలు అరెస్టు చేశాయి. వీరిలో కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎంఎఫ్ఎల్)కి చెందిన నలుగురు సభ్యులను తౌబాల్ జిల్లాలోని లాండింగ్ ఖుమంతెం లైకై వద్ద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో సర్చ్ ఆపరేషన్‌లో తౌబాల్‌లోని లిలాంగ్ వంతెన సమీపంలో నిషేధిత యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (పాంబే)కి చెందిన ముగ్గురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని లామ్‌లై నుంచి కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (నోయోన్) సభ్యుడు, నిషేధిత KCP (PWG) మరో ఉగ్రవాదిని బిష్ణుపూర్‌లోని నింగ్‌థౌఖోంగ్ ఖా కీరుంగ్‌బా లైకై నుంచి అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి దేశీయంగా తయారు చేసిన పిస్టళ్లు, హ్యాండ్ గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

Tags:    

Similar News