BC COMMISSION | కుల బహిష్కరణపై బీసీ కమిషన్ కన్నెర్ర

వరంగల్ లో 15 కుటుంబాలను యాదవ కులపెద్దలు బహిష్కరించిన ఘటనపై తెలంగాణ బీసీ కమిషన్ కన్నెర్ర చేసింది. ఈ ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.;

Update: 2025-01-29 14:38 GMT
బీసీ కమిషన్ ఛైర్మన్ జి నిరంజన్

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామం యాదవ సామాజిక వర్గానికి చెందిన దారపు వెంకటేష్ ఇతర 14 కుటుంబాలను యాదవ కుల పెద్దలు బహిష్కరించిన ఘటన బుధవారం వెలుగు చూసింది. గత 9 నెలలుగా కులానికి దూరం పెట్టిండ్రు అనే శీర్షికతో పత్రికల్లో వార్తలు వెలువడిన విషయం బీసీ కమిషన్ దృష్టికి వచ్చింది.


మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వండి
దీనిపై బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ దృష్టి సారించారు. 15 యాదవ కులాల కుటుంబాలను కుల బహిష్కరణ చేయడాన్ని బీసీ కమిషన్ తీవ్రంగా పరిగణించింది.కుల బహిష్కరణ ఘటనపై జిల్లా కలెక్టరు వెంటనే విచారణ జరిపి, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కమిషన్ కోరింది.ఈ ఘటనపై పూర్తి నివేదికను మూడు రోజుల్లోగా బీసీ కమిషన్ కార్యాలయానికి సమర్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదను బీసీ కమిషన్ ఛైర్మన్ జి నిరంజన్ వరంగల్ కలెక్టరుకు లేఖ ద్వారా ఆదేశించారు.

రెండు పడవల దగ్ధంపై నివేదిక ఇవ్వండి
ఈనెల 20వ తేదీన హుస్సేన్ సాగర్ లో రెండు పడవలు దగ్దమైన ఘటనలో ఇద్దరు యువకులు మృత్యువాతపడగా పదిమందికి పైగా క్షతతగాత్రులు అయ్యారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను మూడు రోజుల్లోగా బీసీ కమిషన్ కు అందించాలని బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ హైదారాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవి ఆనంద్ ను లేఖ ద్వారా కోరారు. హుసేన్ సాగర్ లో బోటు దగ్థమైన ఘటనలో గణపతి, ఎస్ అజయ్ లు మరణించారు. బోటులో బాణసంచా పేల్చిన సందర్భంగా ముందుజాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని నిరంజన్ ప్రశ్నించారు.


Tags:    

Similar News