లాలూకు, కొడుకులకు కోర్ట్‌లో ఊరట!

ఉద్యోగాలకోసం లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఒక ఢిల్లీ కోర్ట్ వీరు ముగ్గురికీ బెయిల్ మంజూరు చేసింది.

Update: 2024-10-07 08:02 GMT

ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లకు ఇవాళ న్యాయస్థానంలో ఊరట లభించింది. ఉద్యోగాలకోసం లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఒక ఢిల్లీ కోర్ట్ వీరు ముగ్గురికీ బెయిల్ మంజూరు చేసింది.

లాలూ ప్రసాద్ యాదవ్ 2004-2009 వరకు రైల్వే మంత్రిగా ఉన్న కాలంలో జబల్పూర్‌ కేంద్రంగా పనిచేసే వెస్ట్ సెంట్రల్ జోన్‌లో గ్రూప్ డి ఉద్యోగాల నియామకాలకు సంబంధించి, ఉద్యోగాలు ఇప్పించటంకోసం మంత్రి లేదా ఆయన కుటుంబ సభ్యులు భూములు పొందారు అని ఈ కేసులో ప్రధాన ఆరోపణ. సీబీఐ దాఖలు చేసిన ఒక ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఈ కేసును దాఖలు చేసింది.

కేసులో సప్లిమెంటరీ ఛార్జిషీట్ చూసిన తర్వాత కోర్ట్ నిందితులు ముగ్గురికీ సమన్లు జారీ చేసింది. ఆ సమన్లకు స్పందిస్తూ వీరు ఇవాళ కోర్టుముందు హాజరయ్యారు. ఒక్కొక్కరికీ ఒక లక్ష రూపాయలు పర్సనల్ బాండ్ ఆధారంగా స్పెషల్ జడ్జి విశాల్ గొగ్నే వీరికి బెయిల్ మంజూరు చేశారు.

Tags:    

Similar News