ఎట్టకేలకు ‘ఎమ్మెల్యేలు’గా ప్రమాణ స్వీకారం

తెలంగాణ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు.

Update: 2023-12-14 08:01 GMT
Telangana Assembly

ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్భరుద్దీన్ ను నియమించడంతో సభ సాంప్రదాయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లఘించిదని బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎంఐఎం సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ ఎమ్మెల్యేలు నిరాకరించిన విషయం కూడా తెలిసిందే.

ఈ రోజు స్పీకర్ ఎన్నిక పూర్తయిన సందర్భంగా ఆయన సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఉన్నట్లయితే రాజ్యాంగంలోని అధికరణ 188 ప్రకారం రోజుకు రూ. 500 ల మొత్తం జరిమానా కట్టాల్సి ఉంది. అలాగే ఓటు వేయడానికి, ఇతర సభ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉండదు.

అంతకుముందు శాసనసభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. స్పీకర్ స్థానానికి ఒకటే నామినేషన్ రావడంతో పోటీ చేసిన తాండూర్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పీకర్ ను ఆయన స్థానం వరకూ తీసుకెళ్లి కూర్చొబెట్టి, పుష్పగుచ్ఛం అందించారు.

తరువాత సభా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నికకు సహకరించినందుకు ప్రతిపక్షానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేర్చలని సభ్యులను కోరారు. అనంతరం ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు. తమ నాయకుడు స్పీకర్ ఎన్నిక కోసం సహకరించాలని ఆదేశించారని చెప్పారు. అనంతరం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్ కు అభినందనలు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ వాయిదా వేశారు. 

Tags:    

Similar News