ఈ రోజు గవర్నర్ ప్రసంగం మీద చర్చ, ప్రతి పక్షం నిప్పులు చెరుగుతుందా!

పదేళ్ల కెసిఆర్ పాలననుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందన్న గవర్నర్ తమిళి సై వ్యాఖ్యను బిఆర్ ఎస్ అంత ఈజీగా వదిలేస్తుందా?

Update: 2023-12-16 03:22 GMT
గవర్నర్ ప్రసంగం

నేడు తెలంగాణ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాలు

నేడు శాసనసభ, శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ విడత అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ రోజు గవర్నర్ తమిళ సై నిన్న ఉభయ సభల నుద్దేశించి చేసిన  ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో నేడు చర్చ జరుగుతుంది.

అనంతరం ప్రభుత్వ సమాధానం ఉంటుంది. కొత్త అసెంబ్లీ ఏర్పడిన తర్వాత కొలువు తీరిన సభలో జరుగుతున్న మొదటి చర్చపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ ప్రసంగంలో తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో అప్పులు భారీగా పెరిగాయని, వ్యవస్థలను దెబ్బ తీశారని గవర్నర్ ఆరోపించారు.అణచివేతనుంచి తెలంగాణ ప్రజలు విముక్తి పొందారని గవర్నర్ పేర్కొన్నారు.దీనర్థం ఏమిటి? ఇది చర్చనీయాంశం కావచ్చు.

గవర్నర్ ప్రసంగాన్ని ప్రతిపక్ష పార్టీ విమర్శించింది. గవర్నర్ చేత అబద్దాలు చెప్పించారని అంది. అంతేకాదు, గవర్నర్ ప్రసంగం కూడా విశేషంగా ఉంది.సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం ఎలా ఉండనుంది అన్న అంశం ఆసక్తికరంగా మారింది?

అందువల్ల గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చవాడిగా వేడిగా సాగవచ్చు.

ఈ నెల 9న సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదట ప్రొటెం స్పీకర్ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ఎన్నిక జరిగాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఇప్పటి వరకు జరిగాయి.

ఈ రోజు చర్చఅనంతరం అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదా తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద బలపరుస్తారు. మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరుస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న మొదటి చర్చ ఇది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ గెలుపు అనంతరం జరుగుతున్న మొదటి చర్చ హాట్ హాట్ గా సాగనుంది. ఇక పోతే, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని ప్రతిపక్షాలు ప్రభుత్వం వత్తిడి పెంచచ్చు. ఇవన్నీ నేటి చర్చలో ప్రతిధ్వనిస్తాయి.

Tags:    

Similar News