కర్నాటకలో హిజాబ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదా?

విద్యాసంస్ధల్లో హిజాబ్ ధరించడంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం సిద్దరామయ్య ఏం చెప్పారంటే...

Translated by :  Chepyala Praveen
Update: 2023-12-23 12:57 GMT

శనివారం ఆయన బెంగళూర్ లో విలేకరులతో మాట్లాడారు. ‘ఇప్పుడు వెంటనే మేం విద్యాసంస్థల్లో హిజాబ్ ను నిషేధాన్ని ఉపసంహరించుకోలేదు. అయితే ఈ అంశాన్ని మాత్రం ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తుంది’ అన్నారు.

ఈసంవత్సరంలోనే మీరు నిర్ణయాన్ని అమలు చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ‘ ప్రభుత్వం స్థాయిలో చర్చించి పూర్తి చేస్తాం’ అని బదులిచ్చారు. అయితే విద్యాసంస్థల్లో మతపరమైన దుస్తుల విషయంలో ఎలాంటి పరిమితిలేదని, దుస్తులు, ఆహరం ఎంపిక విషయంలో వ్యక్తిగత స్వేచ్చ ఉందని కన్నడ సర్కార్ ఇంతకుముందు ప్రకటించింది. దీనిపై బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది.

కాంగ్రెస్ మార్క్ లౌకికవాదం అంటే ఇదా అని ఆరోపణలు గుప్పించింది. ఇలాంటి చర్యలు విద్యాస్థలాల లౌకిక స్వభావం నుంచి పక్కకు తప్పించే చర్యలుగా కాషాయపార్టీ ఆరోపించింది. సిద్దరామయ్య విద్యావాతావరణాన్ని కలుషితం చేసారని కన్నడ బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెస్ బ్రిటిష్ తరహలోనే విభజించు పాలించు రాజకీయాలను ప్రేరణగా తీసుకుని పాలిస్తోందని, బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగించడంలో నైపుణ్యం ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయిన మైనారిటీలో అక్షరాస్యత, ఉపాధి రేటు ఇప్పటికీ 50 శాతం మాత్రంగా ఉందంటే దానికి కారణం మీ విధానాలే’ అని ఆయన ఆరోపణల వర్షం కురిపించాడు. అంతకుముందు బీవై విజయేంద్ర సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘యువమనస్సులను మతపరమైన మార్గాల్లో విభజించిందని అన్నారు’. అంతకుముందు షికారిపుర ఎమ్మెల్యే ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2022లో బీజేపీ సర్కార్ కర్నాటలో విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించింది. 

Tags:    

Similar News