ఎత్తూ పెరగలేదు, రికార్డూ మారలేదు.
2 అడుగులు... అంటే 62.8 సెంటీమీటర్లు.. జ్యోతి అంగే మళ్లీ రికార్డు సృష్టించారు.
జ్యోతీ కిషన్ జీ అమ్గే మళ్లీ మరోసారి తెరపై మెరిశారు. తన రికార్డును ఎవ్వరూ బద్దలుగొట్టకుండా భద్రపరుచుకున్నారు. 2024 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లోకి తన పేజీని తిప్పేయకుండా పదిలపరుచుకున్నారు. అమ్గే ప్రత్యేకతేంటో తెలుసుగా, ఆమె ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ. 16 ఏళ్లుగా ఆమెది అదే రికార్డు. వచ్చే ఏడాదికి కూడా జ్యోతి అంగే..తన రికార్డును పదిలం చేసుకున్నారు. 2024లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో జ్యోతి అంగే అత్యంత పొట్టిమహిళగా నిలిచారు. డిసెంబర్ 16న ఆమె 30వ పుట్టిన రోజు జరుపుకున్నారు.
ఆమె మంచి నటి కూడా..
జ్యోతి కిషన్‌జీ అమ్గే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పొట్టిగా ఉన్న మహిళ. పేరున్న భారతీయ నటి. 2011 డిసెంబర్ 16నాటికి ఆమెకు 18 ఏళ్లు. అప్పటికి ఆమె ఎత్తు 62.8 సెంటీమీటర్లు. అప్పటికి అదే గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా అధికారికంగా నిలిచారు.
నాగపూరు జన్మస్థలం..
రెండు అడుగులు... అంటే 62.8 సెంటీమీటర్లు ఉండే జ్యోతి అంగే.....2011లో 18 ఏళ్ల వయసులో తొలిసారి ప్రపంచంలో అత్యంత పొట్టిమహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకెక్కారు. జ్యోతి అంగే సెలబ్రిటీ కూడా. నటిగా, మోడల్‌గా రాణిస్తున్నారు.1993 డిసెంబరు 16న జ్యోతి జన్మించారు. జన్యుపరమైన లోపం కారణంగా జ్యోతి ఎత్తుపెరగలేదని డాక్టర్లు గుర్తించారు.
జ్యోతి స్వస్థలం మహారాష్ట్రలోని నాగ్‌పూర్. 2009లో తొలిసారి ఆమె ఓ డాక్యుమెంటరీలో కనిపించారు. హిందీ బిగ్‌బాస్ 6లో అతిథిగా పాల్గొన్నారు. పలు షోలలో నటించారు. లోనావాలాలోని సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహం కూడా ఉంది.
గిన్నిస్ బుక్ వాళ్లు ఏమన్నారంటే...
2024లో కూడా ప్రపంచంలో అత్యంత పొట్టిమహిళ రికార్డు జ్యోతిపేరుమీదే ఉంటుందని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తెలిపింది. ఆ సంస్థ ప్రతినిధులు జ్యోతి 30వపుట్టినరోజు నాడే ఆ విషయం వెల్లడించి..ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. 30వ పుట్టినరోజు జరుపుకోవడం, తన రికార్డు అలాగే ఉండడం సంతోషంగా డండడంతో జ్యోతి బోలెడంత సంబరపడిపోయారు.
జ్యోతి వల్లే తమకు, తమ కుటుంబానికి గుర్తింపు దక్కిందన్నది ఆమె తల్లి దండ్రులు చెప్పేమాట. జ్యోతితో కలిసి ఎన్నో ప్రాంతాలు సందర్శించారు. ఎందరెందరో ప్రముఖుల్ని కలిశారు. పెద్ద పెద్ద హోటళ్లలో సెలబ్రిటీలతో డిన్నర్లకు హాజరయ్యామని చెప్పుకొచ్చారు జ్యోతి తల్లిదండ్రులు.