ప్రియాంక గాంధీనే పక్కన పెట్టారుగా!

కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాల ఇన్ చార్జీలను మార్చింది. అందులో భాగంగా యూపీ ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంక గాంధీ వాద్రాని సైతం పక్కన పెట్టింది.

Update: 2023-12-24 10:14 GMT
అవినాష్ పాండే యూపీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్

ఆమె స్థానంలో అవినాష్ పాండేకు యూపీ బాధ్యతలు అప్పగించింది.అవినాష్ పాండే మాజీ రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటిలో సభ్యుడు కూడా. శనివారం కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా వ్యవస్థీకరణ చేపట్టింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా తెలంగాణ సహ అనేక రాష్ట్రాల ఇన్ చార్జీలను మార్చింది.

శనివారం ప్రియాంక గాంధీ వాద్రా నుంచి అవినాష్ యూపీ ఇంచార్జ్ గా బాధ్యతలు స్వీకరించారు. తనను యూపీ ఇంచార్జీగా నియమించినందుకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహూల్ గాంధీలకు కృతజ్ఞతలు చెప్పారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం, కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ట్వీట్ చేశారు.

65 ఏళ్ల అవినాష్ 2010-16 వరకూ మహరాష్ట్ర నుంచి రాజ్యసభ ఎంపీగా పని చేశారు. 2008లో పారిశ్రామికవేత్త రాహూల్ బజాజ్ చేతిలో కేవలం ఒకే ఓటు తేడాతో ఓడిపోయారు. తరువాత జార్ఖండ్ ఇంచార్జీగా పని చేశారు.

అలాగే మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపిన రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ను తప్పించి దీపాదాస్ మున్షీకి బాధ్యతలు అప్పగించింది. ఠాక్రేను గోవా, డామన్ డయ్యూల బాధ్యతలు అప్పగించారు. దీపాదాస్ మున్షీ మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐసీసీ పరిశీలకురాలిగా ఉన్నారు. ఆమె కేంద్రమంత్రి దివంగత నేత ప్రియరంజన్ దాస్ మున్షి సతీమణి, గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 

Tags:    

Similar News