కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల

Producer :  Chepyala Praveen
Update: 2023-12-08 07:04 GMT
హెల్త్ బులెటిన్

 కాలు విరగడంతో ఆసుపత్రిలో చేరిన  మాజీ సీఎం కేసీఆర్  ఆరోగ్యం మీద  హెల్త్ బులెటిన్ ను యశోదా వైద్యులు విడుదల చేశారు.

ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ నివాసంలో గురువారం అర్ధ రాత్రి బాత్ రూంలో కాలు జారిపడటంతో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావురి యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి యశోద దవాఖానాలో డాక్టర్లు చికిత్స అందజేస్తున్నారు.

సిటీ స్కాన్ చేసిన వైద్యులు ఎడమకాలి తుంటి విరిగిందని, శస్త్రచికిత్స ద్వారా రీప్లేస్ చేయాల్సి వస్తుందని డాక్టర్లు హెల్త్ బులిటిన్ విడుదల చేశారుసాయంత్రం నాలుగు గంటల తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు తుంటీ మార్పిడి చేస్తారు. మాజీ సీఎం కోలుకోవడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని వైద్యులు కొద్ది సేపటి కిందట విడుదలచేసిన హెల్త్ బులెటీన్ లో పేర్కొన్నారు.

ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆస్పత్రి మెడికల్ సూపర్నిండేంట్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్ రాత్రి ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్  బాత్రూంలో కాలుజారీ పడ్డారు. పంచె కాలుకి అడ్డురావడంతో కిందపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కేసీఆర్ వెంట కూతురు కవిత, కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ విషయం తెలియగానే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా ఆస్పత్రికి చేరుకుంటున్నారు.  వైద్యులు ఎవరిని లోపలికి అనుమతించడం లేదు.

Tags:    

Similar News