కేటీఆర్‌కు రేవంత్‌ కౌంటర్‌

ఐదేళ్లు సమయం ఉంది.. జరిగిన విధ్వంసం ఏంటో అన్ని బయటపడతాయి. ఎందుకు తొందర..

Update: 2023-12-16 07:12 GMT
కేటీఆర్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కేటీఆర్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ వేశారు. కొంతమంది NRIలకు ప్రజాస్వామ్యం విలువ తెల్వదని అన్నారు. కేటీఆర్ చెప్పే పాపాల్లో ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ళదే పాత్ర ఉందని మండిపడ్డారు. ఐదేళ్లు సమయం ఉంది.. జరిగిన విధ్వంసం ఏంటో అన్ని బయటపడతాయని అన్నారు. కేటీఆర్ మేనేజ్ మెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చారని ఎద్దేవా చేశారు.

రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్‌

కేసీఆర్‌కు రాజకీయ జీవితం ప్రసాదించింది కాంగ్రెస్సేనని మర్చిపోవద్దని రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, సింగిల్ విండో చైర్మెన్ గా ఓడినా కేసీఆర్ ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు. వైఎస్ఆర్ పాలనలో కేసీఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్యే గా లేకుండా మంత్రిగా చేశారని తెలిపారు. ప్రతిపక్షాలకు 2014కు ముందు అభివృద్ధిపై చర్చ కావాలంటే ఒక రోజు అంతా చర్చించుకుందామని అన్నారు.

నా రిప్లై కోసం బీఆర్‌ఎస్ తహతహ..

ప్రజాస్వామ్యంలో 49 శాతానికి 51 శాతానికి చాలా తేడా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. 51 శాతం నెంబర్ ఉన్నవారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజాస్వామ్యంలో 49 శాతానికి సున్నా వాల్యూ అని తెలిపారు. నా రిప్లే గురించి బీఆర్‌ఎస్ తహతహలాడుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. అచ్చోసిన ఆంబోతులం .. పోడియంకి వస్తాం అనే అహం పనికిరాదని దుయ్యబట్టారు.

ఐదేళ్ల టైం ఉంది మిత్రమా!

ఐదేళ్ల సమయం ఉంది ఏమి జరిగిందో అన్ని తెలుసుకుందాం అని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్‌ఎస్ 9 ఏళ్ల పాలనపై ఎక్స్‌రై తీస్తానని చెప్పారు. గతం గురించి చర్చ చేద్దాం అంటే.. ఒక్క రోజు సమయం ఇవ్వండి అన్నీ లెక్కలు తీద్దామని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తమ నాయకులే కొట్లాడారు అని రేవంత్ రెడ్డి అన్నారు.

కేటీఆర్‌ ఏమన్నారంటే...

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నాలుగోరోజు తెలంగాణ అసెంబ్లీ ​సమావేశాల్లో భాగంగా శనివారం గవర్నర్‌ ప్రసంగంపై కేటీఆర్‌ మాట్లాడారు. రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని, ఢిల్లీ నామినేట్‌ చేసీ ముఖ్యమంత్రి అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో త్రాగు, సాగు, కరెంట్ దిక్కు లేదని అ‍న్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 50 ఎకరాల రైతు అయినా సరే గుంపు మేస్త్రి లాగా ఉండేవారని విమర్శించారు. 

Tags:    

Similar News