మావోయిస్టు నేత హిడ్మాకు ప్రమోషన్

మావోయిస్టు(Maoist Party) టాప్ ర్యాకింగ్ నేతల్లో హిడ్మా(Madvi Hidma) కూడా ఒకరన్న విషయం అందరికీ తెలిసిందే;

Update: 2025-09-10 11:24 GMT
Maoist top leader Hidma

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చినట్లు మాడ్వి హిడ్మాకు కూడా మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటి ప్రమోషన్ ఇచ్చినట్లు సమాచారం. మావోయిస్టు(Maoist Party) టాప్ ర్యాకింగ్ నేతల్లో హిడ్మా(Madvi Hidma) కూడా ఒకరన్న విషయం అందరికీ తెలిసిందే. హిడ్మాను సజీవంగా పట్టుకోవాలని కుదరకపోతే ఎన్ కౌంటర్(Encounter) అయినా చేయాలని ఆపరేషన్ కగార్(Operation Kagar) లో భాగంగా భద్రతాదళాలు ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి. అయితే అదృష్టం పక్కనే ఉండటంతో ఇప్పటికి హిడ్మా చాలాసార్లు ఎన్ కౌంటర్ల నుండి తప్పించుకున్నాడు.

మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్లో మరణించిన తర్వాత పార్టీలో హిడ్మాకు ప్రధాన్యత పెరిగిపోయింది. గెరిల్లా దళాల రూపకల్పన, శిక్షణ, దాడుల్లో హిడ్మా పాత్ర చాలా ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఇప్పుడు విషయానికి వస్త మావోయిస్టు కేంద్ర కమిటీకి ప్రధాన కార్యదర్శిగా తిప్పిరి తిరుపతిని నయిమించిన పార్టీ హిడ్మాకు కూడా ప్రమోషన్ ఇచ్చింది. దండకారుణ్యం స్పెషల్ జోనల్ కమిటి కార్యదర్శిగా హిడ్మాను పార్టీ నియమించింది.

ఛత్తీస్ ఘడ్, సుకుమా జిల్లాలోని పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మా దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలకనేతగా చెలామణిలో ఉన్నారు. నిజానికి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటి అన్నది ఇప్పటివరకు లేదు. అయితే కేవలం హిడ్మా కోసమే పార్టీ కొత్త పోస్టును సృష్టించింది. పార్టీకి కొత్త రూపును తీసుకొచ్చి, బలోపేతం చేస్తాడని, కొత్త రిక్రూట్మెంట్ చేయగలడన్న నమ్మకంతోనే పార్టీ సెంట్రల్ కమిటి హిడ్మాకు ప్రమోషన్ ఇచ్చింది.

బస్తర్ అడవుల్లో హిడ్మాకు మంచిపట్టుందన్న విషయం అందరికీ తెలిసిందే. వందల కిలోమీటర్లలో విస్తరించున్న దండకారణ్యంలో హిడ్మాకు అణువణువు కొట్టిన పిండే. అంతేకాకుండా ఆదివాసీల్లో అపారమైన పట్టుంది. ఆదివాసీల్లో హిడ్మాకు రాబిన్ హూడ్ లాంటి ఇమేజి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెద్దవాళ్ళని కొట్టి పేదలు ముఖ్యంగా ఆదివాసీలకు పంచటమనే సూత్రాన్ని హిడ్మా ఆచరణలో పెడుతున్నాడని పోలీసులు గ్రహించారు. ఈ కారణంగానే దండకారణ్యంలో హిడ్మాను పట్టుకోవటానికి భద్రతాదళాలు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కావటంలేదు.

హిడ్మా ఆచూకీ చెప్పటానికి ఆదివాసీ గ్రామాల్లో ఎవరూ భద్రతాదళాలకు సహకరించటంలేదు. పైగా భద్రతాదళాల కదలికలను ఆదివాసీలు ఎప్పటికప్పుడు హిడ్మా లేదా మావోయిస్టులకు చేరవేస్తున్నారని తెలిసింది. ఈకారణంగానే ఎన్ కౌంటర్ల నుండి హిడ్మా ముందుగానే తప్పించుకుంటున్నాడు. భద్రతాదళాలతో పాటు లోకల్ పోలీసులకు కూడా హిడ్మా కొరకరాని కొయ్యగా తయారయ్యాడన్నది వాస్తవం. మరి కొత్తగా ప్రమోషన్ తీసుకున్న హిడ్మాను భద్రతాదళాలు ఎలా డీల్ చేస్తాయో చూడాలి.

Tags:    

Similar News