శ్వేత పత్రం విడుదల చేసిన ప్రభుత్వం.. తెలంగాణలో అన్ని అప్పులా?

తెలంగాణ శాసన సభ ప్రారంభంలోనే అరగంట వాయిదా పడింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిలపై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేసి చర్చ ప్రారంభించారు.

Update: 2023-12-20 06:30 GMT
తెలంగాణ అసెంబ్లీ

దీనిపై ప్రతిపక్ష నేత మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. 40 పేజీల బుక్ ఇచ్చి కనీసం నాలుగు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. తరువాత ఇదే అభిప్రాయాన్ని ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ శాసనసభ పక్ష నేత కూనంనేని సాంబశివరావు వ్యక్తం చేశారు. ఈ అంశంపై శాసనసభ వ్యవహరాల మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ‘ ప్రతిపక్షం నుంచి మేము నిర్మాణాత్మక సలహలు, సూచనలు స్వీకరించాలని కోరుకుంటున్నామని’ చెప్పారు. తరవాత స్పీకర్ అసెంబ్లీకి 30 నిమిషాల పాటు విరామం ప్రకటించారు.

అంతకుముందు సభ ప్రారంభం కాగానే చనిపోయిన మాజీ సభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 42 పేజీల శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. 2023-24 నాటికి తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71, 757 కోట్లు, 2014 నాటికి తెలంగాణ మిగులు నిధులు రూ. 72,658గా వివరించింది. దీని ప్రకారం 2015-16 లో రుణ, జీఎస్డీపీసీలో తెలంగాణ 15.7 శాతంతో తెలంగాణ దేశంలోనే అత్యల్పంగా రుణాలు చేసింది. 2023-24 నాటికి 27.8 శాతానికి పెరిగినట్లు శ్వేతపత్రంలో వెల్లడించింది. ఒక్క 2023-24లోనే రాష్ట్ర అప్పు 3.89 లక్షల కోట్లగా అంచనావేశారు. 

Tags:    

Similar News