తెలంగాణలోనూ ఎస్ఐఆర్
డబుల్ ఓట్లను తొలగించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన సీఈసీ జ్ఞానేష్ కుమార్.
తెలంగాణలో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజ్(SIR) నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. తెలంగాణ.. కెనడా కంటే పెద్ద నగరమని, కాబట్టి ఇక్కడ ఎస్ఐఆర్ అవసరం ఉందని తెలిపారు. డబుల్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లను తొలగించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. జ్ఞానేష్ కుమార్ తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆదివారం రవీంద్రభారతిలో బూత్ లెవెల్ అధికారులను ఆయన సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అధికారులకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. తెలంగాణలో కూడా ఎస్ఐఆర్‌ను విజయవంతం చేయాలని కోరారు. పండగల ముందు ఇళ్లను శుభ్రం చేసుకున్న విధంగానే ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఓటర్ల జాబితాను కూడా క్లీన్ చేస్తామని ఆయన చెప్పారు.
మరో మూడు నాలుగు నెలల తర్వాత రాష్ట్రంలో ఎస్ఐఆర్‌ను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ప్రక్రియకు సంబంధించి జ్ఞానేష్ కుమార్ దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్‌కు ముందు చేయాల్సిన సన్నాహక చర్యలకు సంబంధించి పనులను జ్ఞానేష్ కుమార్ ఆరా తీశారు. ఇప్పటి వరకు 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ముగిసిందని, అతి త్వరలోనే తెలంగాణలో కూడా జరుగుతుందని చెప్పారు. బీఎల్ఓలు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తేనే ఎస్ఐఆర్ విజయవంతం అవుతుందని ఆయన అన్నారు. ఈ అంశంపై ప్రజలకు, రాజకీయ పార్టీలకు ఉన్న అపోహలను నివృత్తి చేయాల్సింది బీఎల్ఓలేనని చెప్పారు. ఒక్కో బీఎల్‌ఓ పరిధిలోకి 850-950 మంది ఓటర్లు వస్తారని వివరించారు.