లక్ష ఓట్ల ఆధిక్యంలో ముగ్గురు అభ్యర్థులు
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో రౌండ్ రౌండ్ కు ఓట్ల ఆధిక్యత పెరుగుతోంది. కాంగ్రెస్, బీజేేపీ అభ్యర్థులు ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ముగ్గురు అభ్యర్థులు లక్ష ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.
By : The Federal
Update: 2024-06-04 06:04 GMT
తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో మంగళవారం 11 గంటల సమయానికి ముగ్గురు అభ్యర్థులు లక్షకు పైగా ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రామసహాయం రఘురామ్ రెడ్డి (ఖమ్మం),కుందూరి రఘువీర్ (నల్గొండ), బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ (మల్కాజిగిరి) కూడా లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
రౌండ్ రౌండుకు పెరుగుతున్న ఓట్ల ఆధిక్యం
రఘురామిరెడ్డి 1,48,091 ఓట్ల ఆధిక్యంలో, కుందూరి రఘువీర్ రెడ్డి 2,12,695 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఖమ్మం, నల్గొండ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా మారాయి. మల్కాజిగిరిలో ఈటల 1,05,472 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
బీజేపీ అభ్యర్థుల ముందంజ
ఆదిలాబాద్ లో గోడం నగేశ్ (బీజేపీ),చేవేళ్లలో విశ్వేశ్వర్ రెడ్డి 33,086 ఓట్లు, కరీంనగర్ లో బండి సంజయ్ 64,406 ఓట్లు,సికింద్రాబాద్ లో జి కిషన్ రెడ్డి 34,076 ఓట్లు, నిజామాబాద్ లో ధర్మపురి అర్వింద్ 17,832 ఓట్లు, మహబూబ్ నగర్ లో డీకే అరుణ 5,652 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఆధిక్యంలో అధికార కాంగ్రెస్ అభ్యర్థులు
భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి 48,622 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 82,286 ఓట్లు,కాంగ్రెస్ అభ్యర్థులు నాగర్ కర్నూల్ లో మల్లు రవి 18,655 ఓట్ల ఆధిక్యంలో , పెద్దపల్లిలో గడ్డం వంశీ కృష్ణ 27,283 ఓట్లు, వరంగల్ లో కడియం కావ్య 48,790, జహీరాబాద్ లో సురేశ్ షెట్కార్ మందుంజలో ఉన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో నువ్వా? నేనా అన్నట్లు బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటాపోటీగా రౌండ్ రౌండుకు ఫలితాలు మారుతున్నాయి.