ముహూర్తానికి ప్రమాణం చేయని రేవంత్! మధ్యాహ్నం 1.04 దాటిపోయింది!!

హైదరాబాద్ ట్రాఫిక్ అంటే అట్టుంటది మరి. పెట్టిన ముహూర్తానికి ఎవరైనా చేరడమంటే మాటలు కాదు మూటలే. సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికీ అదే పరిస్థితి ఎదురైంది.

Update: 2023-12-07 10:26 GMT
REVANT WITH GOVERNOR

హైదరాబాద్ ట్రాఫిక్ అంటే అట్టుంటది మరి. పెట్టిన ముహూర్తానికి ఎవరైనా చేరడమంటే మాటలు కాదు మూటలే. సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికీ అదే పరిస్థితి ఎదురైంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి నిర్ణయించిన సమయం గురువారం మధ్యాహ్నం 1.04 గంటలు. కానీ రేవంత్ స్టేడియంలోకి వచ్చే పాటికే ముహూర్తం మించిపోయింది. అనుకున్న సమయానికి 18 నిమిషాలు ఆలస్యం అయింది.

ట్రాఫిక్ తెచ్చిన ఇక్కట్లు...

మధ్యాహ్నం 1.06 నిమిషాలకు సోనియా గాంధీతో కలిసి ఆయన వెహికల్ స్టేడియంలోకి వచ్చింది. వేదిక మీదకు వచ్చే 1.12 గంటలైంది. అప్పటికే వేదిక మీదున్న రేవంత్ భార్య, కుమార్తె ఉన్నారు. సోనియా గాంధీ వస్తూనే రేవంత్ రెడ్డి మనుమరాలిని బుగ్గ గిల్లి ఆమెకు కేటాయించిన సీట్లో ఆశీనులయ్యారు. ఆ తర్వాత సిద్దరామయ్య, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి పెద్ద తలకాయలు వచ్చాయి. ఆ తర్వాత ఆరు నిమిషాలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై కాన్వాయి వచ్చి ఆగింది. 1.18 గంటలకు గవర్నర్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి ఎదురేగి స్వాగతం పలికారు. 1.19 గంటలకు జాతీయ గీతాలాపనతో ప్రమాణ స్వీకార మహోత్సం లాంఛనంగా ప్రారంభమైంది. 1.20 గంటలకు తమిళి సై, గవర్నర్ మధ్య మాటా మంతీ నడిచింది. 1.21 గంటలకు సీఎస్ శాంతకుమారి గవర్నర్ అనుమతితో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1.22 గంటలకు ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

అనుకున్న దానికన్నా 18 నిమిషాలు ఆలస్యంగా ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ విధంగా.. ముహూర్తానికి ప్రమాణం చేయని ముఖ్యమంత్రుల జాబితాలో రేవంత్ రెడ్డి కూడా చేరిపోయారు.

Tags:    

Similar News