యూకే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి తెలంగాణ బిడ్డ ఎంపికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరకు చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తునారు.

Update: 2024-05-15 11:06 GMT

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి తెలంగాణ బిడ్డ ఎంపికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరకు చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తునారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా పార్టీ ఆయన పేరును పక్రటించింది. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ బౌండరీ కమిషన్ సూచనతో ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటైంది. ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలెక్టోరల్ కాల్కులస్ పక్రారం నియోజకవర్గంలో 68 శాతం లేబర్ పార్టీ గెలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి.

కాగా, బ్రిటన్ లోనూ ఎన్నికల హడావిడి జోరందుకుంది. భారత దేశంలో ఇప్పటికే ఎన్నికలు జరుగుతుండగా ఈ సంవత్సరంలోనే బ్రిటన్, అమెరికాల్లోనూ ఎన్నికలు జరుగనున్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ - పాలస్తీనా సంఘర్షణ, పప్రంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న బ్రిటన్, అమెరికా ఎన్నికల మీద పప్రంచ దేశాల దృష్టి ఉంది.

కాగా ఉమ్మడికరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఉదయ్ నాగరాజు జన్మించారు. ఆయన హనుమంత రావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచే కష్టపడేతత్వం కలిగి ఉండే ఉదయ్ అంచెలంచాలుగా ఎదిగారు. బ్రిటన్ లోని పప్రంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ లో అడ్మినిస్ట్రేషన్ లో పీజీ చేశారు.

ఉదయ్ లాభాపేక్ష లేని సంస్థలను నడపడం నుండి సమగ్ర అభివృద్ధిని పరిశోధించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పభ్రావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ ల్యాబ్స్ ని నెలకొల్పడంలో కృషి చేశారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా పేరు సంపాదించారు. స్కూల్ గవర్నర్ గా, వాలంటీర్ గా, విస్తృత రాజకీయ పచ్రారకుడిగా ఒక దశాబ్దకాలంగా ఇంటింటికీ పచ్రారం చేసి సామాన్యుల కష్టాలపై మంచి అవగాహన సాధించారు.

ఇటీవల తెలుగు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా వివిధ సర్వేల ఆధారంగా కన్సర్వేటివ్ పార్టీ కనీవిని ఎరుగని రీతిలో ఓడిపోయి లేబర్ పార్టీ గెలుస్తుందని విశ్లేషించారు. గత కొన్ని ఎన్నికల్లోనూ లేబర్ పార్టీ ఎంపీలు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ నెల జరిగిన కౌన్సిలర్, రాష్ట్ర మేయర్ ఎన్నికలోనూ లేబర్ పార్టీ విజయం సాధించింది. దీంతో తెలంగాణకి చెందిన ఉదయ్ నాగరాజు కూడా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధిస్తారని ఆయన సన్నిహితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News