సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేదెవరు?

తెలంగాణ కొత్త సభ్యలుతో కొత్త అసెంబ్లీ ఏర్పాటు సర్క్యూలర్ జారీ చేశారు. ఇక ముఖ్యమంత్రి పేరే తెలియాల్సి ఉంది.

Update: 2023-12-04 12:32 GMT
గవర్నర్ ను కలిసిన ఎన్నికల అధికారులు

అలాగే కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. మధ్యాహ్నం తెలంగాణ ప్రధాన ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ గవర్నర్ ను కలిసి ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను అందించారు. అనంతరం గవర్నర్ నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియన చేపట్టారు. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొలువవుతున్న మూడో అసెంబ్లీ. నిన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఏర్పడిన తరువాత కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చింది. దీంతో తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత ఏర్పడిన రెండో అసెంబ్లీని గవర్నర్ రద్దు చేశారు.

ఇక ముఖ్యమంత్రి పేరు బయటకు రావడమే మిగిలి ఉంది.

ఇపుడు కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశమయి  శాసన సభాపక్ష నాయకుడిని ఎన్నుకోవాలి. ఆయన పేరు గవర్నర్ పంపించి ముఖ్య మంత్రిగా నియమించాలని కోరుతారు. ఆమె ఆమోదం ఆటోమేటిక్ గాజరుగుతుంది. అనంతరం ఆయన ముఖ్య మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్య మంత్రి ఒక్కరే బాథ్యతలు స్వీకరించవచ్చు. లేదా క్యా బినెట్ మంత్రులు మొత్తంగా బాధ్యతలు స్వీకరించవచ్చు.

కాంగ్రెస్ కు ‘సిఎం’ తలనొప్పి

అయితే, కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఫలానా అని ఇంకా ప్రకటన వెలువడలేదు. పిసిసి  అధ్యక్షుడు రేవంత్ రెడ్డియే ముఖ్యమంత్రి అని ప్రచారంలో ఉన్నా ఆయన  మీద ఏకాభిప్రాయం కుదిరనట్లు లేదు. ముఖ్యమంత్రి రేసులో భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. వీళ్లని బుజ్జగిజ్జకుండా  రేవంత్ ను  ప్రకటించలేరు. అందువల్ల అధిష్టానం ఇపుడు రేవంత్ కు పోటీగా వస్తున్న సీనియర్ నేతలను బుజ్జగించే పనిలో ఉంది. ఈ పనిమీదే ఇక్కడ పరిశీలకుడి ఉన్న కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ను ఢిల్లీ రంపించారు. మంతనాలు ఇపుడు ఢిల్లీ సాగుతున్నాయి. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఆరోతేదీన జరుగుతుందని అనుకుంటున్నారు.

అలకసీన్లు మొదలు

మరో వైపు రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పరిశీలకులు సమావేశమయి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవుల విషయంలో తాడో పేడో తేల్చుకోనున్నారు. ఎప్పటిలాగానే సీఎం అభ్యర్థి ఎవరు అనేది కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేయనంది అయితే, రేవంత్ ను ముఖ్యమంత్రి చేసేందుకు సీనియర్లు ఎవరూ సుముఖంగా లేరు. అంతేకాదు, కొందరు ఉప ముఖ్యమంత్రి పదవికి అంగీకరించినా, రెండో ఉప ముఖ్యమంత్రి వద్దంటున్నారు మరికొద్దరు రేవంత్ సన్నిహితురాలు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు అంగీకరించడంలేదు. ఇలా ఏదీ తెగక ముందే ఈ లోపు . ఈ సాయంత్రమే రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా సీతక్క, భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేయనున్నారనే వార్తలు గుప్పు మన్నాయి. దీనితో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలక బూనినట్లు తెలిసింది. మరొక వైపు కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నట్ల్లు తెలిసింది.

ఇది ఇలా ఉంటే, రాజ్ భవన్ లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త సీఎం కోసం ఆరు కార్లతో కూడిన కొత్త కాన్వాయ్ ను అధికారులు సిద్ధం చేశారు. వాహనాలన్నీ దిల్ కుషా గెస్ట్ హౌజ్ కు చేరుకున్నాయి.

Tags:    

Similar News