58 రోజులు చదివితే విజయం తథ్యం...
సూదిరెడ్డి నాగిరెడ్డి ఆదిలక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బెక్కంటి శ్రీనివాస్ రావు సూచన.;
58 రోజులు అంకితభావంతో చదివితే పదో తరగతి పరీక్షల్లో విజయం తధ్యమని దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామంలోని సూదిరెడ్డి నాగిరెడ్డి ఆదిలక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బెక్కంటి శ్రీనివాస్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మంగళవారం నాడు పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో పరీక్షల సన్నద్ధతపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బెక్కంటి శ్రీనివాసరావు గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు గణనీయమైన సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు వారు మాట్లాడుతూ మార్చిలో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల దృష్ట్యా ఈ రెండు నెలలు విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని, ఇంటి వద్ద పిల్లల చదువుకునే వసతులు మరియు సౌకర్యాలు కల్పించాలని కోరడమైనది. ముఖ్యంగా ఈ రెండు నెలలు సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, ఉదయాన్నే నిద్రలేపాలని, ప్రతిరోజూ ఉపాధ్యాయులు ఉదయమే ఫోన్ చేసి విద్యార్థులు చదువుతున్నారో లేదో తెల్సుకుంటారని తెలియచేసారు. విద్యార్థుల ప్రగతిని గురించి తల్లిదండ్రులతో చర్చించటమైనది.
పాఠశాల గణిత విభాగ సీనియర్ ఉపాధ్యాయులు కృష్ణ మాట్లాడుతూ కష్టపడింది ఒక ఎత్తు 58 రోజులు అంకిత భావంతో ప్రధానోపాధ్యాయులు సూచన మేరకు ఆయన ఇచ్చిన కార్యాచరణ ప్రణాళికను అందరు అమలు చేస్తే ఈ సంవత్సరం పాఠశాలలో నూటికి నూరు శాతం విద్యార్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం తరగతి ఉపాధ్యాయుడు బుర్రయ్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ మంచి ఆహారాన్ని ప్రతిరోజు తీసుకుంటూ ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తే మంచి మార్కులు సాధించటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
అనంతరం పాఠశాల తరగతి ఉపాధ్యాయుడు స్వామి మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుని పిలుపుమేరకు ఎప్పుడు రాని రీతిలో అనూయస్పందనతో తల్లిదండ్రులు పదో తరగతి సమావేశానికి హాజరు కావడం ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రతి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు చిలకమర్రి శ్రీనివాసు, P.రమణ, S. కృష్ణ, బొర్రయ్య, స్వామి సార్లు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గోన్నారు.