మా అమ్మ
Ann Taylor 'My Mother' కు డా.చెంగల్వ రామలక్ష్మి తెలుగు అనువాదం. (నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం);
By : The Federal
Update: 2025-05-11 02:42 GMT
నేను ఊయలలో పడుకున్నప్పుడు పక్కనే కూర్చుని, నా చిన్ని తలను గమనిస్తూ మధురమైన ఆప్యాయతా కన్నీటి ధారను కురిపించింది ఎవరు?
మా అమ్మ!
నా ఆరోగ్యం, బాధ నన్ను ఏడిపించినప్పుడు
నా బరువెక్కిన కళ్ళను తదేకం గా చూస్తూ
నేను చనిపోతానేమోననే భయంతో దుఖించింది ఎవరు?
మా అమ్మ!
నా లేత పెదవులకు ప్రార్ధనను, దేవుని పవిత్ర గ్రంథాన్ని, రోజు ను ప్రేమించటం నేర్పి,
చక్కని వివేచనా మార్గంలో నడిపించింది ఎవరు?
మా అమ్మ !
నాపై అంత కరుణను చూపించిన
నీపై వాటిని చూపకుండా నేనెన్నడైనా ఉండగలనా!
ఓహ్!నేను ఆ ఆలోచననే భరించలేను.
మా అమ్మ !
దేవుడు కరుణించి నాకెక్కువ ఆయుష్షు నిస్తే
నీ ప్రేమ ను, సంరక్షణను నీకు ప్రతిఫలంగా ఇస్తాను
మా అమ్మ !
-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
(డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గురజాడ రచనలపై పరిశోధన చేసారు. 'చెంగల్వ పూలు 'అనే కథా సంపుటాన్ని, 'గురజాడ అప్పారావు ', జాషువా జీవితం --సాహిత్యం ', అనే పుస్తకాలను ప్రచురించారు.ప్రస్తుతం సాహిత్య వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, కథలు, కవితలు వివిధ పత్రికలలో రాస్తున్నారు.)